• Hrudaya Netram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హృదయనేత్రం

    Hrudaya Netram

    Publisher: Srilekha Sahiti

    Pages: 56
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సుజన కవిత్వము సరళంగాను ఉండడంతో పాటు, ఒక విషయాన్ని అందించి పాఠకులను ఆలోచింప చేస్తుంది. సుజన కవితలు అనేక పత్రికలలోను, పోటీలలోను సమయోచిత స్థానమును పొందాయి. కవితలలో నానుడులు, సామెతలు అలవోకగా ప్రత్యక్షమవడంతోపాటు, అవి సందర్భముగాను ప్రకాశిస్తాయి. ఒక నీతిని కూడ అందిస్తుంది. ఏ పాఠకులనైనా అవి హాయిగా చదివిస్తుంది. అందులో లీనము చేసుకుంటుంది.

- ప్రకాశకులు

సామాజిక సంఘటనలకు, సాంసారిక సంబంధాలకు తగురీతి స్పందించిన కవితలెన్నో యీ సంపుటిలో చోటుచేసుకున్నాయి. అన్ని కవితల్లోనూ నవత-మానవత అంతస్సూత్రంగా యీ 'హృదయనేత్రం'లో అగుపించడం విశేషం!

- డా. వడ్డేపల్లి కృష్ణ

ఈ హృదయనేత్రం కవితాసంపుటి ద్వారా హింస ద్వేష నినాదపూరిత లోకంలోని అహింసాజీవిత సంవిధాన మహతీ గానమాధుర్యాన్ని ఆస్వాదింపజేయగలగడం సర్వదా హర్షణీయం.

- వడలి రాధాకృష్ణ

ఇవన్నీ జీవితం నుంచి పుట్టిన అలలు. వీటి వేగం, ఆవేశం, ఉద్వేగం, ఆవేదన, సౌందర్యం, స్పర్శ చదివితేనే అర్థమవుతుంది. ప్రతి కవిత ప్రయోజనం ఆశించి రాసిందే! సమాజం కోసం కవి కన్నును ప్రిజంగా మలచుకొని బహుముఖీయ కోణాల్లో ఆవిష్కరించిన సుజనాదేవి సాహితీరంగంలో మరింతగా కృషి చేసి తనదైన స్వరాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

- చిల్లర భవానిదేవి

Preview download free pdf of this Telugu book is available at Hrudaya Netram