-
-
హిందూ సంప్రదాయ వేడుకలు
Hindu Sampradaya Vedukalu
Author: Victory Academic Unit
Publisher: Victory Publishers
Pages: 42Language: Telugu
హిందువుల ఇళ్ళలో జరుపుకునే అనేక సాంప్రదాయక వేడుకల గురించి ఈ చిన్న పుస్తకం తెలియజేస్తుంది.
బారసాల, అన్నప్రాసన, ప్రధమ జన్మదిన వేడుకలు, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం చేయించడం, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, పేరంటాలు, బాలికలు రజస్వల సందర్భం, ఉపనయనం, నిశ్చితార్థం, వివాహం, అప్పగింతలు, గృహప్రవేశము వంటి సందర్భాలలో ఏమేమి చేయాలో ఎలా మసలుకోవాలో ఈ పుస్తకం తెలిజయేస్తుంది.
ఉండ్రాళ్ళ తద్దె, అట్టతద్దె, 16 కుడుముల నోములు ఎలా చేసుకోవాలో, ఆ నోముల కథల వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
వ్యక్తుల జీవితంలో ముఖ్యమైన ఘటనలు... మ్యారేజి డే, సిల్వర్ జుబ్లి, గోల్డెన్ జుబ్లి షష్టిపూర్తి, సహస్ర చంద్రోదయము వంటి ఉత్సవాలను ఎలా జరుపుకోవాలో తెలియజేస్తుంది.
వివధ సందర్భాలలో స్త్రీలు పాడుకునే పాటలు - అప్పగింతల పాట, వరుస పాట, చెండ్ల పాట, మంగళహారతి, సత్యనారాయణస్వామి పాట, గౌరిదేవి పాట, తులసి పాట, సమర్త పాట, జోల పాట, గొబ్బిళ్ళ పాట, భోగిపండ్ల పాట ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.
కొన్ని రకాల పచ్చళ్ళు ఎలా తయారు చేయాలో వివరించబడింది.

- ₹60
- ₹108
- ₹60
- ₹378
- ₹60
- ₹60