• Hari Satakamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • హరి శతకము (free)

    Hari Satakamu - free

    Pages: 26
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శతకం.... తెలుగు సాహిత్యంలోని ఒక విశిష్ట ప్రక్రియ. మకుటోపేతమై, అష్టోత్తరశత ముక్తక పద్య శోభితమై, శ్రవణ సుభగ చ్ఛందోబద్ధమై, అగణిత కవిరాడ్విరచితమై, పండిత పామర జన రంజకమై, శతాబ్దాలుగా విరాజిల్లుతున్నది. విషయపరంగా ఎన్నో వైవిధ్యాలున్నా అందులో భక్తి, నీతి శతకాలే మిన్న.

గుండు మధుసూదన్‌గారు సంప్రదాయ సాహితీమూర్తులు. బాల్యం నుండి పెక్కు సాహిత్య గ్రంథాలను కూలంకషంగా అధ్యయనం చేసిన ప్రజాధురీణులు. ఛందో వ్యాకరణ శాస్త్రాలలో దిట్ట. ప్రౌఢ కవిత్వంలోను, మృదుమధుర కవిత్వంలోను అందెవేసిన చేయి. 'మధురకవి' వారి బిరుదు. ఎంతో కాలంగా అంతర్జాలం వేదికగా బ్లాగులు నిర్వహిస్తూ, ఇతర బ్లాగులు, వాట్సప్ సమూహాలలో బహుముఖప్రజ్ఞతో పద్యాలు వ్రాస్తూ, ఔత్సాహికుల పద్యాలను సమీక్షిస్తూ, వారికి సలహాల నిస్తూ భారతీ పదార్చన చేస్తున్నారు. సమకాలీన సాహితీలోకంలో వారి పేరు తెలియనివారు అరుదు.

అటువంటి కవివతంసుని రచన ఈ 'హరి శతకము'. వ్రాసి చాలా కాలమైనా ఇప్పటికి ముద్రణకు నోచుకొని మనకు కవితా మాధుర్యాన్ని అందిస్తున్నది. పుస్తకమంతా భక్తిభావోన్నత్యం, కవితా మాధుర్యం పడుగుపేకల వలె అల్లుకొని ఉన్నాయి. "ఇది బాగుంది" అని విడిగా ఎత్తి చూపడానికి ఒక్క పద్యమూ దొరకదు. అన్నీ రసగుళికలే, దేనికదే మధురాతిమధురం. మధురకవి కదా!

అల్ప పరిమాణం కల ఈ శతకంలో అనల్ప హరి మాహాత్మ్యం వర్ణింపబడింది. విష్ణుదేవుని ప్రాభవం, కారుణ్యం, అవతార విశేషాలు, భక్తావనదీక్ష, ఆత్మ నివేదన, శరణాగతి.... ఇలా ఎన్నో అంశాలు ప్రస్తావింపబడ్డాయి. సమర్థ పద ప్రయోగ నైపుణ్యం, గంగాప్రవాహం వంటి ధార, లక్షణోపేతమైన రచనా సంవిధానం మనలను ముగ్గులను చేస్తాయి.

- కంది శంకరయ్య