• Happiness To Success
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • "హ్యాపినెస్" తో సక్సెస్

    Happiness To Success

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 152
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆనందం మన అంతిమ లక్ష్యం కావాలి. ఆనందాన్ని హరించే ఏ ఆలోచన, ఏ పని చేయకు. మనల్ని శక్తిమంతులుగా చేసి, జీవన ప్రమాణం పెంచే ఏకైక దివ్య ఔషధం ''ఆనందం''. ''సంతోషం సగం బలం కాదు; సంపూర్ణ బలం'' అంటారు డా॥ యం.వి. రావు.

* * *

ఏ పని చేస్తే మనస్సు రంజిల్లుతుందో ఉల్లాసంగా, ఉత్సాహంగా మారుతుందో, ప్రశాంతతను అనుభవిస్తుందో అటువంటి భావనే ఆనందం అని స్థూలంగా చెప్పుకోవచ్చు.

ఆనందం అనే భావన విశాలమైనది, జీవితంలోని ప్రతీక్షణం మనిషి ఎదురు చూసేది ఆనందాన్నే, అయితే వ్యక్తి దాన్ని పొందేది మాత్రం చాలా కొద్ది మోతాదులో మాత్రం. ఎందుకిలా అంటే మనిషి తనకు ఎదురైన ప్రతి అనుభవాన్ని ఆనందస్వరూపంగా చూడకపోవడం వల్ల అని సమాధానం చెప్పవలసి వస్తుంది.

ఆనందంగా ఉండే స్థితిని ఎక్కువ కాలం పొందగలిగి ఉన్నామంటే అది విజయమే. కాబట్టి ఆనందంగా ఉండం అలవాటైతే జీవితంలో విజయం సాధించినట్లే.

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వ్యక్తిత్వ వికాసనిపుణుడిగా, వైద్యుడుగా, రచయితగా ఉండటమే కాక తను ఆనందంగా ఉంటూ ఇతరులు ఆనందంగా ఉండడానికి సహకరించే డా॥ ఎమ్‌.వి.రావుగారు ఈ పుస్తకంలో అనేక కోణాల నుంచి ఆనందంపై విశ్లేషించారు. ఆనందం యొక్క ఓపెన్‌ సీక్రెట్‌ అంటూ ఎంత అద్భుతంగా తన రచనశైలిని కొనసాగిస్తూ డబ్బు- పెళ్ళి-పిల్లలు వల్ల ఆనందాన్ని పొందవచ్చా? చిరునవ్వు ఆనందంపై ప్రభావం ఇలా ఎన్నో.... ఎన్నో... అంశాలతో క్షణం క్షణం ఆనందానుభూతిని కల్గించే రీతిలో రచనాశైలితో ఆనందానికి చక్కటి మార్గాలను పాఠకులకు అందించే రావుగారి ప్రయత్నం అభినందనీయం.

- డా॥ టి.ఎస్‌.రావు

Preview download free pdf of this Telugu book is available at Happiness To Success