• Guru Darsanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గురు దర్శనం

    Guru Darsanam

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనసా, వాచా, కర్మణా మనం యోగ-ధ్యాన పద్ధతులకు సిద్ధం అయి సాధన కొనసాగిస్తే - క్రమంగా ప్రాపంచిక ప్రలోభాలకు దూరం కాగలుగుతాం, వైయక్తిక సుఖలాలస వైపు మనసు మొగ్గు చూపదు, ప్రపంచానికి దూరమవుతూ మనకి మనం దగ్గరవుతాం, చైతన్యవంతులమై అనంత శక్తిని ఆస్వాదిస్తాం, మనం అంతర్థానం అయి అరూపంగా అభావంగా మిగులుతాం, ఆత్మశక్తి పరాశక్తుల అనుసంధానం అనుభూతిస్తాం, జీవాత్మ పరమాత్మల మమేకత్వంతో విశ్వాంతరాళంలో అంతర్భాగం అవుతాం - ఇవన్నీ సాధనలో అధిరోహించే మెట్లు - ఇదంతా యోగక్రియ - ఇదంతా ఆత్మపథం - ఈ ఆత్మపథంలో ఒక ఉన్నత శిఖరం - ఆ శిఖరాగ్రం నుండి పరమ గురువు నిర్నిమేషంగా నిన్నే చూస్తుంటాడు - అది పరమ గురువు ఆహ్వానం ... ఆ శిఖరానికి చేరుకోగలిగితే అంతటా కాంతి ... అంతా శూన్యం ... భూత భవిష్య వర్తమానాలకి అక్కడ ఉనికి లేదు ... మిగిలింది ఆత్మ ... ఒంటరిగా! అదీ గురుదర్శనం!

అంటే ఉపదేశించిన గురువు సద్గురువుగా, మహా గురువుగా మన సాధనలో పరిణమించాలి. అంటే, 'పరమ గురువు'గా ప్రపంచం గుర్తించినా మనం గురువుగా భావించి సాధన ప్రారంభిస్తే మన సాధనా బలాన్ని బట్టి ఆ గురువే క్రమంగా సద్గురువుగా, మహా గురువుగా పరిణమిస్తూ పరమ గురువు స్థాయికి చేరుకుంటాడు. మన సాధనకి, అనుభూతికి, అనుభవానికి అందివచ్చిన పరమ గురువు పదుగురిలో ఒకు కాడు ... పరమం, పవిత్రం అవుతాడు. అప్పుడు చెప్పుకోవచ్చు ... మనం 'గురుదర్శనం' అయిందని. భౌతిక గురుదర్శనం కాదు మనకి కావలసింది ... ఆత్మ గురుదర్శనం ... అది విశ్వరూపదర్శనం.

నాకు తల్లి ఒడి బడి అయింది ... తండ్రి ఒడి గుడి అయింది ... తల్లిదండ్రుల గుడి యోగాలయ మయింది. ఈ శరీరానికి రూపం తల్లి ... జీవం తండ్రి ... ప్రాణం యోగం. కన్న తండ్రే - ఉపదేశ గురువు ... సాధనలో సద్గురువు ... మార్గ నిర్దేశకంలో మహాగురువు ... పరమ పథంలో పరమ గురువు ... వెరసి ''ఆత్మయోగి''. ఇదీ నా ఆత్మదర్శనం ... నా గురు దర్శనం ... నా యోగదర్శనం.

- వాసిలి వసంతకుమార్

Preview download free pdf of this Telugu book is available at Guru Darsanam