-
-
గుర్నూలు పూలు
Gurnoolu Poolu
Author: Multiple Authors
Pages: 102Language: Telugu
Description
“గుర్నూలు పూలంటే పొద్దుతిరుగుడు పూలు. పొద్దుతో పాటే తిరిగే పూలు. వెలుగు దారేదో ఎరిగిన పూలు. మీ చేతిలోని కథలు ఈ పూలలాంటివే. చిమ్మ చీకటిలా కమ్ముకున్న నైరాశ్యాన్ని చీల్చి, వెలుగు జాడను వెతికి చూపెడుతున్న కథలు. దశాబ్దాల జడత్వాన్ని వీడి, తొలి కిరణాల కొసలందుకుని రేపటిలోకి తొంగి చూస్తున్న కథలు.”
- యెనికపాటి కరుణాకర్
“ఆంధ్ర, తెలంగాణలకన్నా ముందు తెలుగు కోడి కూసిందీ, తెల్లవారిందీ ఈ సీమలోనే. అయితే ఆ తెలుగు కోడి తొందరపడి ముందే కూసిన కోయిలలా బ్యాక్ బెంచ్‌లో వినిపించకుండా నిస్సహాయంగా కూర్చుని వుందిప్పుడు చరిత్రలో.
రెంటికన్నా ముందే కూసిన ఈ కోయిల కరువులోనూ పాడుతున్న వసంతగీతిక ఇది. ఇది ఇప్పటికీ మన చెవిన పడకపోతే మనం కబోదులమే కాదు బధిరులమూ ఆవుతాము చరిత్రకి.”
- చింతపల్లి అనంతు
Preview download free pdf of this Telugu book is available at Gurnoolu Poolu
Login to add a comment
Subscribe to latest comments
