-
-
గుండెల్లో గోదారి
Gundello Godari
Author: Kameswari Chengalvala
Publisher: J.V.Publishers
Pages: 156Language: Telugu
గోదావరి నిర్మలంగానూ ఉండగలదు, పరవళ్లు తొక్కుతూ ఉరకగలదు, పోటెత్తి బీభత్సాన్నీ సృష్టించగలదు. కామేశ్వరి కథలు అలాగే కొన్ని ఆహ్లాదంగా, కొన్ని ఆలోచనాత్మకంగా, కొన్ని ఆగ్రహావేశాలని కలిగిస్తూ సాగిపోతాయి.
సరదాగా, ఆహ్లాదంగా నడిచే కథల్లో కూడా ఒక సందేశం కనిపిస్తుంది. పెంపుడు జంతువులు పెంచుకునేవారికి సంతోషాన్ని కలుగజేస్తాయి కానీ, ఇంటికొచ్చినవాళ్లకి ఎంత చిరాగ్గా ఉంటుందో ఒక కథ చెప్తుంది. ఇల్లాలి మాట కాదనలేక ఇంట్లో ఉన్న కుక్క పిల్లులతో మారుతీరావు అవస్థ కళ్లముందు కనిపిస్తుంది ఇంకొక కథలో... ఋణానుబంధం జంతువులకీ, మానవులకీ కూడా ఉంటుందని చెప్తారీ కథల్లో.
భర్త తనకు కావలసినట్లుగా శుభ్రత పాటించడని, కాపురాన్ని వదిలేసి వచ్చిన కూతురికి, తన సంసారంలో లేని కష్టాలను కల్పించి చెప్పి ఏ విధంగా నడుచుకోవాలో చెప్పి దిద్దిన తల్లి, స్నేహితురాళ్లని పిలిచి బ్లూ ఫిల్మ్‌లు చూపించి అవస్థపడిన కోమలి, భర్తతో చిలిపి తగవుని పరిష్కరించుకుని హాయిగా ఉన్న వాసంతి, మనవరాలి మొండితనానికి బాధ పడుతున్న బామ్మని మనవరాలే ఓదార్చిన వైనం.. ఈ కథలన్నీ పాఠకులని ఆలోచింపచేస్తాయి. నిత్య జీవన విధానంలో మనసుని ఏ విధంగా నియంత్రించుకుంటూ సంతోషంగా ఉండొచ్చో చెప్తాయి.
- మంథా భానుమతి
