• Gunde Jabbulu Pratyamnaya Parishkaralu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గుండె జబ్బులు ప్రత్యామ్నాయ పరిష్కారాలు

    Gunde Jabbulu Pratyamnaya Parishkaralu

    Pages: 121
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవ దేహ సంపూర్ణ స్వస్థత దేహంలో సహజంగా ఉండే నాలుగు ద్రవాలు (హ్యుమర్స్) సరైన నిష్పత్తిలో ఉండడం మీద ఆధారపడుతుందని, వాటిని అలా సహజ పరిమితులలో ఉంచుకొనడమే సంపూర్ణ స్వస్థతను కొనసాగించుతుందని హిపోక్రేట్స్ క్రీస్తుకు పూర్వం అయిదవ శతాబ్దంలోనే స్పష్టం చేశాడు.

మన ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడైన, దానికి నామకరణం చేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి రూఢి చేసిన, చరక మహాశయుడు క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినవాడు. ఆయన మానవ దేహ సంపూర్ణ స్వస్థత, దేహంలో సహజంగానే ఉండే ప్రయోజనకరమైన వాత, పిత్త, కఫ ధాతువులు సరైన నిష్పత్తిలో ఉండడం మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మూడు ధాతువులలో ఏ ఒక్కటిగానీ, అంతకన్న ఎక్కువ ధాతువులు గానీ, పరిమితులు దాటి అధికమైనప్పుడు అవి దోషాలుగా పరిణమించి వ్యాధులకు కారణం అవుతాయని చరక మహాశయుడి సూత్రీకరణ.

హిపోక్రేట్స్ సూత్రీకరణల, చరకుడి సూత్రీకరణల సారాంశం ఒక్కటే. ప్రధాన సూక్ష్మ పోషక పదార్థాలు సరైన నిష్పత్తులలో ఉన్నప్పుడు సంపూర్ణ స్వస్థత పటిష్టంగా ఉంటుంది. సంపూర్ణ స్వస్థత వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధుల్ని నిరోధించడం, నయం చేయడం సులభతరం చేస్తుంది. వ్యాధులను, ఆరోగ్యాన్ని పటిష్టం చేసే ఆహార పదార్థాలతోనూ, వ్యాధులను నయం చేసే మూలికా ఔషధాలతోనూ నయం చేయవచ్చు.

* * *

యాంజియోప్లాస్టీ, స్టెంట్, బైపాస్ సర్జరీలు లేకుండా శాశ్వత, సంపూర్ణ స్వస్థతని పొందేందుకు తగిన సూచనలు సలహాలు తెలిపే వ్యాసాలివి.

Preview download free pdf of this Telugu book is available at Gunde Jabbulu Pratyamnaya Parishkaralu