• Grenade Group
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గ్రైనేడ్ గ్రూప్

    Grenade Group

    Author:

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మర్నాడు ఉదయం ఎనిమిదిగంటల సమయంలో చర్చిలో సమావేశం అయ్యారు కులకర్ణిగారి అసిస్టెంట్లు అందరూ.

గాఢనిద్రలు పోతున్నారు బంధిపోట్లు అందరూ. నిశబ్దంగా వుంది స్థావరమంతా.

“మన లిస్టులోనుంచి బలదేవ్‌ని తొలగించేశాను! మిగిలిన అయిదుగుర్ని ఖతంచేసేస్తే ఈ గాంగ్ డిసార్గనైజ్ అవుతుంది...తేలికగా బంధించవచ్చు...” బీడీని ఆర్పి అవతల విసిరేస్తూ జరిగిన సంఘటనలను కులకర్ణిగారికి వివరించాడు షాడో.

సాలోచనగా తల వూపారాయన.

"మరి బాస్ తయారుచేసిన మందు మాటేమిటి? పాపం పీటర్స్ పిచ్చెత్తిన వాడిలా తిరుగుతున్నాడు... ఆ మందు పట్టుకొని" అన్నాడు ముఖేష్.

"వాడిని కరుణించటం - కరుణించక పోవటం శ్రీమతి బిందుగారి యిష్టం...ఎలా అయినా ఫరవాలేదు."

"ఒకవేళ లొంగిపోయినట్లు నటిస్తే... బిందుకు రక్షణ ఏమిటి? అసలే పందికొక్కువాడు, ఏమైనా చేస్తే?"

ఆ ప్రశ్నతో కొంచెం గట్టిగా ఆలోచించారు వారందరూ.

బిందు గొంతు సవరించుకొని వారిని తనవైపు చూసేటట్టు చేసింది.

"ఆత్మరక్షణ చేసుకోవటం ఎలాగో నాకు బాగా తెలుసు. దాన్ని గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు..." అంటూ.

మరి కొంచెంసేపు ఆలోచించి ఆమె మాటలకు తలలు వూపారు అందరూ.

"ఏమైనా అయితే విజిల్ వెయ్యి సిస్టర్... ఎలాగో ఒకలా వచ్చి పడతాం...సాధ్యమైనంతవరకూ...బార్ రూమ్ వెనుకవున్న పొదల వైపున పోవటం మంచిది. ఆ గోడలకు కంతలున్నాయి. అవసరం అయితే వాటిల్లోనుంచి రివాల్వర్ దూర్చి సాయపడతాం" అన్నాడు వాసు.

మరి రాత్రి వినవచ్చిన దెయ్యం మాటేమిటి?" ప్రశ్నించాడు షాడో. శ్రీకర్ నెత్తిమీద ఒక్కటి వేసి అతను చేసిన ఘనకార్యాన్ని వివరించారు కులకర్ణిగారు.

ఆ రోజు సాయంత్రం తను వెంట తెచ్చిన చొప్పదంటుతో ఒక బూరా తయారుచేశాడు శ్రీకర్. అదివూదితే కర్ణకఠోరమైన శబ్దం వస్తుంది - ఆడదాని ఏడుపులా, ఆ ఏడుపుకు మరికొన్ని మాటలు జతచేసి మరింత గోల చేశాడతను.

కులకర్ణిగారి మాటలకు కడుపుబ్బ నవ్వారందరూ...శ్రీకర్ తీసుకున్న రిస్క్‌కి అతన్ని నిందించారు.

"అదృష్టవశాత్తు ఆ పువ్వు బయటపడి వాటిని డైవర్ట్ చేసింది. లేకపోతే నువ్వు దయ్యమై పోయేవాడివి బ్లడీఫూల్... వెధవబూరా! దానిజోలికి పోబోకు" హెచ్చరించాడు షాడో.

ఇంకెందుకు పోతాను గురూ...ఆ సయానీగాడు కొట్టిన దెబ్బలకే బుద్ది వచ్చింది" డొక్కలు నొక్కుకుంటూ అన్నాడు శ్రీకర్.

Preview download free pdf of this Telugu book is available at Grenade Group