-
-
గ్రహాంతర వాసి
Grahaantara Vasi
Author: Rani Siva Sankara Sarma
Pages: 169Language: Telugu
క్షణాలలో అన్ని తెలుగు పుస్తకాల మీద ధూళి పేరుకుపోయి, తెలుగుకి ప్రాచీన భాష హోదా లభించింది. కారణం యేమిటంటే తెలుగుని అత్యాధునిక ప్రపంచంలోకి ప్రవేశపెట్టిన సర్వస్వం అంతరించాడు.
అందరికంటే యెక్కువగా సర్వస్వం వొక సత్యాన్ని గుర్తించాడు. తెలుగులో ఆధునికత సహజంగా వచ్చిందికాదు. అది దిగుమతి చేసుకున్న ఆధునికత, దళారీ ఆధునికత. సొంత ఆధునికత దానికిలేదు తెలుగుభాష పరాధీనం. అందువల్ల సొంతభావాలూ సొంతరచనలూ అనే మిథ్యాభావాన్ని విడిచిపెట్టాలి. యీ వాస్తవం చాలామంది మేధావులకి తెలుసుకాని, సర్వస్వంలో జీర్ణమైనంతగా యెవరిలోనూ జీర్ణంకాలేదు. అందుకే అతడు బతికివున్నంత వరకు వొకసొంత ఆలోచన చేయలేదు. సొంతమాట మాట్లాడలేదు.
సొంతాస్తిని విడిచిపెట్టడం కన్న సొంతాలోచనని త్యజించడం చాలా కష్టం. అందుకు చాలా జ్ఞానం కావాలి. దానిని సర్వస్వం సాధించాడు. సర్వస్వం యికలేడు అన్నమాట తెలుగునాట కాన్వెంటు స్కూళ్లు అన్నీ మూతపడ్డాయి అన్నంతగా భయపెట్టింది మేధావి వర్గాన్ని.
యెందుకంటే సర్వస్వం వల్ల యెందరో రచయితలు లాభపడ్డారు అవార్డులు పొందారు. అతడేది చెప్పినా యింగ్లీషు వుటంకింపుల్తో చెప్తాడు. అందువల్ల వారి రచనలకి కూడా తెలుగు మీరిపోయాయన్న గౌరవం దక్కేది.
శర్మగారి రచనల గురించి విన్నాను,చదివాను. ఆయన పుస్తకాలు చదవాలని ఆసక్తి ఉన్నది. కాని ముంబాయిలో దొరకటం దుర్లభం. ఇక కినిగె లో చూస్తే ప్రింటు పుస్తకం లేదు. ఉన్నదల్లా ఈ బుక్. కినిగె వారి ఎ బుక్ ఫార్మాత్ అంటె నాకు పరమ చిరాకు. చక్కగా కిండెల్, ఎ పబ్, పి డి ఎఫ్ ఫార్మాట్లు ఉంటె ఏదో అంతుచిక్కని ఫార్మాట్లొ ఇస్తారు, అది దౌన్లోడ్ చేసుకుని చదవొచ్చెప్పటికి చదివే ఆసక్తి నశిస్తుంది. కినిగె వారికి విజ్ఞప్తి ఏమంటె, వారి ఎ బుక్ ఫార్మాట్ మారిస్తే చాలా మంది హాయిగా కొనుక్కుని చదువుకుంటారు.ఆ ఫార్మాట్ ఐ పడ్ (ఇతర పాడ్లు) లో కొబొ, ఐ బుక్స్ వంతి అప్ప్లికేషన్లల్లో చదువుకునే వీలుండాలి. కినిగె వారు వేసే ఏ పుస్తకాలకోసం ప్రత్యేకంగా మరొక అప్లికేషన్ మైంటైన్ చెయ్యలెము కదా!
Did not like the book..I have recently heard so much about this writer thought I will give it a try ...may be his other books are good..