• Gokulamlo Radha
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోకులంలో రాధ

    Gokulamlo Radha

    Author:

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నన్ను నువ్వు, నిన్ను నేను అందుకోవాలని కాంక్షతో ఎంతగా కాలిపోతున్నామో అంతగానూ దూరం చేస్తుందీ కాలం. ఔను. నేను కాలానికి ఎదురీదలేక, రాసే రాతల్లోనే స్వర్గసౌధాల్ని నిర్మించి, ప్రేరేపించి నిన్ను శోకింపజేస్తున్న పిరికివాడ్ని, నీకంటే ఈ ప్రపంచంలో ఎవరూ అధికుల కారని తెలిసికూడా వందల మైళ్ళు దూరం పారిపోయి ఉద్యోగం, ధర్మమంటూ నిన్ను ఆ నది ఒడ్డున ఒంటరిగా వదిలివేయడం నేరంకదూ? పాపం కదూ?
దేవుడిచ్చిన విలువైన వరానివైన నిన్ను పెంచుకోవాల్సింది, నీతో జీవితం పంచుకోవాల్సిందీ నువ్వు వుంటున్న ఆ ఇంట్లోకాదు-
మనవూరి నదిలో ఎన్నోమైళ్ళు ప్రయాణం చేస్తే కన్పించే నిర్జనమైన, ఎత్తయిన పాపికొండల సమూహం దిగువున దర్శనమిచ్చే మైదానంలో మనమిద్దరమే శ్రమించి నిర్మించుకుందాం అందమయిన కుటీరాన్ని, దానిచుట్టూ వెన్నెల వృక్షాల్ని పాతుకుందాం. నక్షత్రాల్ని పువ్వులుగా పూయించుకుని, శతకోటి చందమామల్ని ఫలాలుగా పండించుకుందాం. తొలకరి జల్లుని, వణికించే చలిని, వెచ్చని సూర్యుడ్నీ అవసరమయినప్పుడు పిలుచుకుందాం. గ్రీష్మంతో పనిలేదని చెప్పేసి వసంతంతోనే బంధుత్వం పెంచుకుందాం.
ఎన్నో ఏళ్ళగా ఎదురుచూస్తున్న ప్రియుడు ఎన్నో వందలమైళ్ళ దూరం నించీ ఆమెకి రాసిన ప్రేమలేఖ అది. అనుభూతుల్ని ఆహారం చేసుకుని బతుకుతున్న ఆమె పేరు రాధ.

Preview download free pdf of this Telugu book is available at Gokulamlo Radha