• Godavari Ghumaghumalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోదావరి ఘుమఘుమలు

    Godavari Ghumaghumalu

    Publisher: J.V.Publishers

    Pages: 116
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆకలేసినప్పుడు ఎవరికైనా ముందుగా అమ్మ గుర్తొస్తుంది. అమ్మ చేతివంటలు లొట్టలేసుకుని తినేస్తాము. అమ్మ దగ్గరున్నన్నాళ్లు తినడమే తెలుసు, వండటం చేతకాదు.

ఇలా పెళ్లయి అలా వెళ్తామో లేదో! మన వచ్చీరాని పాకకళా ప్రావీణ్యంతో, రకరకాల ప్రయోగాలతో శ్రీవారిని బుట్టలో వేసే ప్రయత్నం చేస్తాము.

మగడి హృదయంలోకి దారి కడుపు నిండినపుడే అన్నమాట అక్షరాలా నిజం! అలా వండి పెట్టగలిగినపుడే ‘భోజ్యేషు మాత’ అనిపించుకోగలం.

అలా ఎలా చేసినా తింటూ, మనలని ఎంకరేజ్ చేస్తుంటే, వాళ్ల కోసం ఏదయినా నేర్చేసుకుంటాము. అలా అమ్మల దగ్గరనుండి, అత్తగారి దగ్గరనుండి నేర్చుకున్న వంటలతో అన్నపూర్ణాదేవి అవతారమెత్తే అమ్మాయిలందరూ మన బాపతే!

దేనికయినా వాటి మూలాలుంటాయి. అలాగే ప్రాంతాలవారీగా రకరకాల వంటలు ప్రాముఖ్యత చెందుతాయి. ఇంక శాఖాహార వంటలు అయితే చెప్పక్కరలేదు.

ఎన్ని రకాల కూరలో ఎన్ని విధాల వండుతారో! అయితే ఎక్కడ ఏది తిన్నా, ఏది నచ్చినా ఎలా చేసారో కనుక్కుని వండి పెట్టడానికి భేషజాలకు పోనక్కరలేదు. నేర్చుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో పంథా ఉంటుంది.

అలా పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి, తూర్పు గోదావరిలో మెట్టిన నేను నేర్చిన ఉభయగోదావరి జిల్లాల వంటలను కొన్నింటిని ఈ 'గోదావరి ఘుమఘుమలు' పుస్తకం ద్వారా మీకందిస్తున్నాను.

- చెంగల్వల కామేశ్వరి

Preview download free pdf of this Telugu book is available at Godavari Ghumaghumalu