• Godari Gattollu Gatsunna Goppollu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గోదారి గట్టోళ్ళు గట్సున్న గొప్పోళ్ళు

    Godari Gattollu Gatsunna Goppollu

    Pages: 44
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమరావతి ఆంధ్రులకు అఫీషియల్‌ రాజధాని అయితే, రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని. తరతరాలుగా తరగని సంపదగా సంక్రమిస్తున్న తెలుగోళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఈ నగరంలో ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనబడ్డమే అందుకు నిదర్శనం.
నాకు తెలిసినంతవరకూ గోదావరి నది ఒడ్డున వెలసి, ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందడమే కాకుండా, ఎందరో మహానుభావులను అందించిన ఏకైక నగరం రాజమహేంద్రవరం. సుప్రసిద్ద పుణ్యక్షేత్రాలు, పచ్చటి పంటపొలాలు, గోదావరి పాయలూ, కొబ్బరి తోటలు వీటి మధ్య ప్రశాంతతకు ఆలవాలమైన ఈ నగరం ఆంధ్రరాష్ట్రానికి తలమానికంలాంటిదనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.
ఇక సినిమాల విషయానికొస్తే ఇక్కడ తీసిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. నిర్మాతలకు డబ్బు, దర్శకులకూ పేరు ప్రతిష్ఠలూ తెచ్చిపెట్టాయి. ఇక్కడ సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. నిర్మాతలు మంచి కథలు ఎన్నుకొని, ఈ లొకేషన్స్ ను సరైనరీతిలో వినియోగించుకొని అద్భుతమైన సినిమాలు తీయచ్చు. మూగమనసులు, శంకరాభరణం, చిల్లరకొట్టు చిట్టెమ్మ లాంటి సినిమాలు అందుకు చక్కటి ఉదాహరణలు.

మరుగున పడుతున్న, మరపుకుగురవుతున్న గతకాలపు గోదావరి ఘనులతో పాటు, నేటితరంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కళాకారులనూ, సాహితీ వేత్తలను ఈ తరం వారికి పరిచయం చేయాలనీ, గుర్తు చేయాలనీ తాపత్రయంతో చేసిన చిన్న ప్రయత్నమిది. బలమైన పోలీసుశాఖలో బరువైన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, కష్టమైనా ఇష్టంగా చేసిన ఈచిన్నపాటి పరిశోధన మరెందరికో ఇన్స్పిరేషన్‌ కావాలనీ, మరిన్ని పుస్తకాలు వెలువడ్డానికి నాంది కావాలనీ నాప్రగాడాభిలాష. ఎందుకంటే, ఇందులో ప్రస్తావించిన చాలామందికి ఓ పుస్తకం వ్రాసేంత చరిత్ర ఉంది.

- బి. యస్. జగదీష్

Preview download free pdf of this Telugu book is available at Godari Gattollu Gatsunna Goppollu