• Gitamrutam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • గీతామృతం (free)

    Gitamrutam - free

    Pages: 336
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

డా. రాఘవేంద్ర ప్రసాదుగారు అధ్యాత్మిక మార్గంలో, చింతనతో, భావప్రకటనతో చక్కని సచ్ఛీలతతో మనుగడ సాగిస్తున్న జిజ్ఞాసువు. తన జిజ్ఞాసాపథంలో సాగిన ఆలోచనలనీ, గ్రహించిన సద్విషయాలనీ, అక్షర రూపంలో అందించడం వారి ప్రత్యేకత. యిదివరలో హిందూ ధర్మంపై అవగాహన కలిగించే పుస్తకాలను రచించారు.

హిందూ జీవన విధానంలో పలు వ్యవస్థావిశేషాలను విశ్లేషించినారు.. ఇప్పుడు తన భగద్గీతాధ్యయన సరళిని యీ పుస్తక రూపంలో అందించారు. ముందుగా గేయము వంటి రచనతో శ్లోకాలను తెలుగు చేసి, వాటికి సరళమైన భావావిష్కరణచేసారు. భగవద్గీత వంటి మహాగ్రంథాన్ని ప్రతి శ్లోకం అధ్యయనం చేసుకోవటం సామాన్యం కాదు. తను గ్రహించిన అర్థాన్ని తిరిగి అందరికీ తెలియచేయాలనే సంకల్పము అభినందనీయమే.

ఆ సంకల్పాన్ని చక్కగా నెరవేర్చుకున్నారు శ్రీ ప్రసాదుగారు. అనవసరపు విస్తారం లేకుండా, సూటిగా తేటగా వ్రాసారు. వృత్తిరీత్యా గొప్ప వైద్యులై, ప్రవృత్తి రీత్యా భగవదారాధనా తత్పరులై, తత్వచింతన కల వీరు- తన సంస్కారాన్ని చక్కగ ఇందులో ఆవిష్కరించారు. ఇది వీరు చేసిన గొప్ప గీతా సాధన అని అభివర్ణించవచ్చు. తనవైన ప్రత్యేకానుభవాలను కూడా ఇందులో వ్యక్తపరిచారు.

వీరి భావన - సాధన - చింతన అభివందనీయాలు.

- సామవేదం షణ్ముఖ శర్మ

గమనిక: " గీతామృతం " ఈబుక్ సైజు 6.2mb