• Ghantasala Gnapakalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఘంటసాల జ్ఞాపకాలు

    Ghantasala Gnapakalu

    Pages: 250
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ రచన ఘంటసాల అభిమానులకు కానుకగా భావించవచ్చును. ఘంటసాలకు పరిచయం ఎవరు రాసినా సూర్యభగవానుడిని చూపించనికి దివిటీ పట్టినట్టే. అయితే ఈ జ్ఞాపకాలను నివేదించడంలో రచయిత్రి తీసుకొన్న శ్రద్ధాసక్తులు ప్రశంసనీయంగా గుర్తించగలం. తను పుట్టిన పరిసరాలు, తన కుటుంబ సభ్యులూ తప్ప మిగిలిన ప్రపంచమూ జీవితపు విలువలూ, ఆశలూ, ఏమీ తెలియని అమాయక, అగ్రహారీక బాలికగా, అసాధారణ గాయకుడు ఘంటసాల అర్ధాంగి అయి ఆయన సాహచర్యంలో పొందిన జ్ఞాపకాలు ఎంతో ముగ్ధమోహనంగా, నిరాడంబరంగా, తేటగా, అమాయకంగా కరుణజనకంగా కూడా తెలియజేసారు రచయిత్రి. సంగీత విద్యార్థిగా, గాయకునిగా, సహజకవిగా, దేశభక్తునిగా, సినీనిర్మాతగా ఘంటసాల పొందిన జీవిత అనుభవాలు ఈ జ్ఞాపకాలలో తెలుసుకోగలం. ఈర్ష్యాసూయలు, వ్యవహారిక విషయాల్లో స్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఏ క్లిష్టమైన విషయమైనా ఏ మాత్రం ఆవేశం లేకుండా తేలికగా, సానుభూతిగా చెప్పగలిగే నేర్పు రచయిత్రిలో సహజంగా ఉంది.

- పి. సంగీతరావు

* * *

ఈ పుస్తకము ఎందుకు రాసినట్లు అని ఎవరైనా నన్ను అడగవచ్చును. నేను కనిపించగానే నన్ను చూసి ''ఘంటసాల గార్ని చూసినంత సంతోషంగా ఉంది'' అని అంటూ వుంటారు అభిమానులు.

ఎన్నో సందర్భాలలో చాలామంది అభిమానులు ఘంటసాల మాస్టారు గురించి విషయాలు చెప్పండి అంటూ ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకని అలా అడుగుతారు ? ఆయన మీద ప్రజలకి, పండితులకి, పామరులకి, సరిగా వ్యక్తం చేయలేని మామూలువాళ్ళకి ఇష్టం కనుక అని నేను అనుకుంటా. చదువుకోవటానికి బాగుంటుందని 'జ్ఞాపకాలను' రాసి ఈ పుస్తకం ద్వారా తెలియపరుస్తున్నాను.

నేను చదువుకోలేదు. 6వ తరగతి వరకు మాత్రమే చదివాను. ఎవరిని అడగలేదు నేను. మామయ్య నాతో చెప్పిన విషయాలనే నాకు తెలిసిన భాషలో రాసాను. మామయ్య స్వయంగా చెప్పి ఉంటే బాగుండేది. ఈ పుస్తకము మీ అందరికి ఆమోదంగా ఉంటుందనే భావంతో రాసాను. దీన్ని మీరందరూ అంగీకరించి నా ప్రయత్నం సఫలమైతే నా జన్మ ధన్యమైందని ఆనందిస్తాను.

- ఘంటసాల సావిత్రి

Preview download free pdf of this Telugu book is available at Ghantasala Gnapakalu