• Geluchukunna Jeevitham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గెలుచుకున్న జీవితం

    Geluchukunna Jeevitham

    Author:

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బి.ఎస్.రాములు తన రచనల్లో సమాజంలోని 'బతుకు పోరు'ను మనిషిలో చూస్తారు. 'మనిషిలోని చరిత్ర హోరు'ను కథలో ఆవిష్కరిస్తారు. జీవితానికి లక్ష్యాలు నిర్దేశించి స్ఫూర్తినందించే రచనలు ఎంతో అవసరం. వాటిని చదవడం ద్వారా జీవితంలో మంచి జరుగుతుంది. సమాజానికి మేలు జరుగుతుంది.

ఇవి జీవితాన్ని గెలుచుకున్న కథలు....

ఓడిపోయిన జీవితాన్ని తిరిగి గెలుచుకున్న కథలు....

* * *

ఇవి కథలు కావు. మనిషి వెతలు. ఈ కథలు చదువుతుంటే దేశం తిరుగుతూ ఆయా ప్రాంతాల్లోని వ్యక్తులతో ముచ్చటిస్తూ వివరాలు అడిగి తెల్సుకున్నట్టు ఉంది... ఈ కథలను చదవండి. ఇవి మామూలు కథలు కానేకావు. భారతీయ జీవిత క్రమాల్ని సమాజ పరిణామంలో భాగంగా చిత్రించిన కథలివి. భారతీయ ప్రజల యాభయి ఏళ్ళ చరిత్రను జీవిత పరిణామాల్ని సమాజ తీరుతెన్నుల్ని సంస్కృతి వికాసాన్ని విశ్లేషించి చూపే కథలివి.

- బోయ జంగయ్య

ప్రజల సాహిత్య సామాజిక సాంస్కృతిక ప్రయోజనాలను నెరవేర్చగల కథలు గొప్ప కథలు. వాటితోపాటు మహోన్నత సమాజ నిర్మాణం కోసం ఉదాత్తీకరిస్తూ పాఠకుల్ని చైతన్యవంతం చేసే కథలు ఉత్తమ కథలు. ఈ ఉత్తమ కథల కోవకు చెందిన బి.ఎస్‌. రాములుగారి కథల్ని మామూలు తూనిక రాళ్ళతో కొలవలేం... ఈ కథలు తెలుగు ప్రజల ముఖాల్లో, హృదయాల్లో ఒక చెప్పలేని కళాకాంతుల్ని ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఇవి చదివితే భాష వస్తుంది. అనుకున్న భావాన్ని చెప్పడం వస్తుంది. ఉత్తమ కథల లక్షణం ఇది... కాలక్షేపాన్ని ఆశించి కథలు చదివే పాఠకుల కోసం ఈ కథలు రాయబడలేదు. మేధావుల్ని రచయితల్ని నిద్రపోనివ్వని కథలివి.

- సదానంద శారద

కథల్ని చాలామందే రాస్తారు. అయితే జీవితం లోతు పాతులు చూసి రాసే వాళ్ళు తక్కువ. జీవితానుభవాల్లోంచి వస్తువును తీసుకొని అనుభవించి, పలువరించి విశ్లేషించి రాసే కథకుల్లో బి.ఎస్‌. రాములుగారు ముందు వరుసలో ఉంటారు. వీరి కథల్లో విప్లవవాదం, దళితవాదం, స్త్రీవాదం లాంటి ఏ ఒక్క వాదమో కాకుండా అన్ని వాదాలూ ఒక సమగ్రతలో ఒదిగిపోయి మానవేతి హాసంగా రూపుదిద్దుకుంటాయి. వీరు అన్నివాదాల లోతుపాతులపై పట్టు సాధించిన విషయం వీరి కథల ద్వారా స్పష్టమవుతుంది. అట్టడుగు వర్గాల మానవేతిహాసాన్ని మానవ సంబంధాలను విశ్లేషిస్తూ కథలు రాస్తున్నారు బి.ఎస్‌. రాములు గారు.

- డా॥ కాలువ మల్లయ్య

Preview download free pdf of this Telugu book is available at Geluchukunna Jeevitham