• Geetanjali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గీతాంజలి

    Geetanjali

    Pages: 124
    Language: Telugu
    Rating
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    4.17 Star Rating: Recommended
    '4.17/5' From 6 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

గీతాంజలి

మూలం: రవీంద్రనాథ్ ఠాగూర్

అనువాదం: మువ్వల సుబ్బరామయ్య

ఈ లోకంలో నా కళ్ళముందు ఓ రోజు అదృశ్యమౌతుందని,
జీవితం నా కళ్ళపై చివరి తెరలాగి,
మౌనంగా సెలవు తీసుకుంటుందని నాకు తెలుసు.

అయినా ఆరోజు ఆకాశంలో నక్షత్రాలు,
నిత్యం మాదిరే నిరీక్షిస్తూ ప్రకాశిస్తాయి,
ఎప్పటిలాగే ప్రభాతం ఉదయిస్తుంది.
అలల సుఖదుఃఖాలను ఒడ్డుకు విసిరి,
కాలసముద్రంలో గడియలు నిశ్వసిస్తాయి.

నా కడపటి క్షణాలను తలుచుకున్నప్పుడు,
క్షణాలకు క్షణాలకు మధ్య దూరం మాయమైంది.
మృత్యుకాంతి సాయంతో నాకు,
నీ లోకంలోని అనంత నిధులు కనిపించాయి.
నేను కావాలని అనవసరంగా కోరుకున్నవీ,
నాకు సులభంగా లభించినవీ, పోనీ.
నే కోరుకుని తృణీకరించినవి
వాటినే వాస్తవంగా నాకు ప్రసాదించు.

Preview download free pdf of this Telugu book is available at Geetanjali