• Gautamabuddhuni Charitra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గౌతమబుద్ధుని చరిత్ర

    Gautamabuddhuni Charitra

    Pages: 68
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గౌతమబుద్ధుని చరిత్ర

Desineni

రచన: కీ. శే. దేశినేని వేంకట్రామయ్య




"భజ గోవిందం! భజ గోవిందం! గోవిందం భజ మూఢమతే!" అని శ్రీ శంకరాచార్యులవారు చెప్పిన గోవింద ద్వాదశమంజరికా స్తోత్రములోని మొదటి చరణం పరమపవిత్రం. అట్లే గోవింద నామము సర్వ పాపహరణము. దానికి సమరూపము "బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి" అనునది తేజిత బౌద్ధధర్మసూత్రము. అహింస పరమధర్మమను బౌద్ధతత్వాన్ని తన కఠోర నియమావళితో ఆవిష్కరించి గౌతమ బుద్ధుడు బోధిసత్వుడైనాడు. నిష్కామి కానివాడు ముక్తసంగుడు కాజాలడని ఎలుగెత్తి చాటి మానవజాతికి మార్గదర్శకతను అందించిన మహాప్రవక్త బుద్ధుడు. దశావతారాల్లో ఒక అవతారపురుషునిగా బుద్ధుడు భావించబడ్డాడు.

అట్టి మహానుభావుని చరిత్రను మహాకవి శ్రీ దేశినేని వేంకట్రామయ్యగారు తన జీవిత చరమాంకదశలో, అతితక్కువ వ్యవధిలో అంటే కేవలము 13 దినములలో (11.07.1981 -23.07.1981) 293 పద్య గద్యములతో "గౌతమబుద్ధుని చరిత్ర" సిద్ధార్ధునిగా జననమాదిగా, బోధిసత్వుడగుట, మహానిర్వాణము వరకు విశేషములను కూర్చి ముగించడం జరిగింది. ఇందలి విషయ పరిశీలన చేసినచో కవిగారు ఏదో భావోద్వేగమునకులోనై ఈ కావ్యమును రచించిరని తోచుచున్నది. లీలామానుషులైన శ్రీకృష్ణభగవానులే కవిగారిని ప్రేరేపించిరను భావము కలుగుచున్నది. కాకపోయిన ఆనాటి శ్రీ వేంకట్రామయ్యగారి దేహారోగ్యము యిట్టి మహత్కార్యమునకు సహకరించడం అనూహ్యము.

కవిగారు రచించిన "మనశ్శాంతి" గ్రంథములో "జీవన గమ్యం" అను శీర్షిక క్రింద బుద్ధుని గూర్చి తెలిపిన భావన వీరి మనోవిచారమునకు పరాకాష్ఠ. శ్రీశుడే బుద్ధుని అవతారమని తలచుట హృద్యము.
ఉ. బుద్ధుడవై జనించి వెడ బుద్ధు లవశ్యము వీడి సద్దయా
బుద్ధి వహించి జీవతతి బుట్టుట గిట్టుట దుఃఖ హేతువన్
బుద్ధి ప్రజాళికిన్ హితవు పోకడలన్ వెలయించి తుల్యమౌ
బుద్ధి జరించి మించిన ప్రబుద్ధుడ! బుద్ధుడ! నా నమస్కృతుల్.

పాఠకుల మనోల్లాసమునకు దివ్యమైన వేదిక గౌతమబుద్ధుని చరిత్ర. తిలకించండి.

Preview download free pdf of this Telugu book is available at Gautamabuddhuni Charitra