• Gandhini Champindi Evaru
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గాంధీని చంపింది ఎవరు?

    Gandhini Champindi Evaru

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 217
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారత జాతిపిత మహాత్మాగాంధి మన కన్నుల ముందు నేలపై నడయాడిన భగవత్స్వరూపుడు. అయితే ఎందరో ప్రజల ముందు ఆయన హత్య చేయబడ్డాడు. ఇంతవరకు అందరకు తెలిసినదే ఇది. కానీ గాంధీ హత్యను గురించి ఎన్నో విషయాలు చిలువలు పలవలై ప్రజల మస్తిష్కాలలో చోటుచేసుకున్నాయి. ఎన్నో అబద్ధాలు ప్రజలలో వ్యాపించాయి. ఎన్నో అబద్ధాలు సుబద్ధాలుగా ప్రచారం అయినాయి.

అసలు హంతకుడైన నాథూరామ్ గాడ్సే పేరుతో సహా తప్పే. అలాగే మన దేశనాయకుల వ్యక్తిత్వాలను గురించిన అపప్రథలు ఎన్నో వ్యాప్తిలోకి వచ్చాయి. “ప్రియమపి అసత్యం న బ్రూయాత్” అంటుంది, మన ధర్మం ద్వారా వెలుగులోనికి వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన సంఘటన ఇది. దీనికి నేడు సందర్భశుద్ధి ఉన్నదా అని సందేహించవచ్చు. సత్యం నిప్పులాంటిది. అది కాలటం మొదలు కాకముందే, నిజం నిర్భయంగా బయటపడేటట్లు చేయటం మన అందరి కర్తవ్యం. అది అవసరం కూడా.

ఈ పుస్తక రచయిత డాక్టర్ వైయన్నార్ అసలు నిజాలేమిటో బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. మీరు దీనిని పఠించండి, పరిశీలించండి, పరిశోధించండి, నిజం నిగ్గు తేల్చండి. కొన్ని అపప్రథలను అగ్నికి ఆహుతి చేయటానికి సహకరించండి. అందుకే ఈ పుస్తకం ద్వారా నిజాల నిప్పును మీ వద్దకు చేరుస్తున్నాము. దీనిని ఆదరించండి.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Gandhini Champindi Evaru