• Gadilo Dorala Palana
  • Ebook Hide Help
    ₹ 120 for 30 days
    ₹ 648
    720
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గడీలో దొరల పాలన

    Gadilo Dorala Palana

    Pages: 650
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ నవల చాలా విలువైనది. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతానికి సంబంధించిన దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నది. అక్కడ నెలకొన్న ఫ్యూడల్‌ వ్యవస్థ సామాజిక - ఆర్థిక రూపాన్ని, ఆ వ్యవస్థలో 150 సంవత్సరాలలో వచ్చిన మార్పులను రచయిత కంటికి కట్టినట్టు కథగా చెప్పుతాడు. మూల పుస్తకం రాసిన రచయిత డా॥ నారాయణ మొగసాలె గారు తుళునాడు ప్రాంతానికి చెందినవాడే. పైగా జీవితాన్ని లోతుగా చదివినవాడు కావడంతో తుళు సమాజానికి సంబంధించిన ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా చదివించే రీతిలో, మనసుకు తాకేటట్టుగా, కళ్ళముందు చిత్రం కదులుతున్నట్లుగా చెప్పగలిగారు.

తుళునాడులో మాతృస్వామ్య వ్యవస్థ ప్రధానంగా ఉండేది. ఇంటి ఆస్తి వారసత్వంగా స్త్రీలకు దక్కేది. పుట్టిన పిల్లలకు భార్య ఇంటిపేరునే పెట్టుకుంటారు. అయితే కుటుంబంలో జన్మించిన మగవాళ్ళు ఆస్తిపాస్తుల వ్యవహారాలను మేనేజర్లుగా నిర్వహిస్తుంటారు. మన దగ్గర మాదిరిగానే తుళునాడులోను గడీ కేంద్రంగా ఫ్యూడల్‌ ప్రభువుల పెత్తనం సాగింది. కొన్ని తుళునాడు మొత్తానికి కేంద్రంగా నిలిచిన గడీలు. కాగా మిగతావి మండల, గ్రామస్థాయి గడీలు. గ్రామగడీలకు అనుబంధంగా ఉపగడీలు కూడ ఉండేది. ఇటువంటి గడీలలోని ఒక గడీ చరిత్ర, సాంతేరుగడీ చరిత్ర ఇతివృత్తంగా నవల సాగుతుంటది.

డా॥ మొగసాలె గారు విస్తృతమైన కాన్వాస్‌ తీసుకున్నారు. అద్భుతమైన రీతిలో కథను చెప్పారు. అందువల్ల ఈ నవలకు ఒక విలువ వచ్చింది.

అనువాదం బాగా ఉంది. అయితే కన్నడ ప్రాంతాలలో మాట్లాడే తెలుగును వాడటం వలన అక్కడక్కడ చదవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కష్టం ఏదైనా శాఖమూరు రామగోపాల్‌ కష్టపడి ఒక మంచి కన్నడ నవలను తెలుగువారికి అందించారని అంగీకరించక తప్పదు.

ఈ నవల భారతదేశంలోని ఒక ప్రాంతానికి సంబంధించినది. అయితే కొంచెం అటుఇటుగా ఇటువంటి మార్పులే దేశంలోని చాలా ప్రాంతాలలో వచ్చినాయి. అందుకని నవలను పట్టుకొన్న వారెవరైనా అయిపోయే దాకా వదలకుండా చదువుతారని కచ్చితంగా చెప్పగలను.

- ఆచార్య ఎం.కోదండరామ్

గమనిక: "గడీలో దొరల పాలన" ఈబుక్ సైజు 9.04 mb

Preview download free pdf of this Telugu book is available at Gadilo Dorala Palana