• Flying Bomb
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఫ్లయింగ్ బాంబ్

    Flying Bomb

    Author:

    Pages: 87
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“అయితే ఏమిటి? షాడో కేమైనా కొమ్ములున్నాయా? మనందరికీలేని మరో జత చేతులు, కాళ్ళు వున్నాయా? పిల్లికి వున్నట్లు తొమ్మిది ప్రాణాలున్నాయా?”

“క్షమించాలి సార్! మీరు అన్నవన్నీ అతనికివున్నాయి గట్టిగా మాట్లాడితే ఇంకో రెండింతలు ఎక్కువే వున్నాయి లేకపోతే ఏమిటిసార్? ఎంత ప్రాణాలకు తెగించినా, ఒక సామాన్యమైన కారును ఆరు అడుగుల ఎత్తుకు జంప్ చేయించి - అది తేలికగా తప్పించుకోగల శక్తి మనలో ఎవరికి వుంది?” మొండిగా బదులు చెప్పాడు ఆ ఆఫీసరు.

ఐ.జి.పి. మండిపోయాడు. పళ్ళు కొరుకుతూ అతని వంక చూశాడు కాని అతని పక్కన వున్న ఆఫీసర్ల ముఖాలమీది భావాల్ని గమనించి తన కోపాన్ని తనలోనే అణిచి వేసుకున్నాడు.

“యస్! ఎంత అధికారం చేతిలో వున్నా మెజారిటీ అభిప్రాయాలకు విరుద్దంగా ప్రవర్తించటం మంచిది కాదు.

“ఆల్‌రైట్! షాడో ఒక సూపర్‌మాన్! ఫ్లయింగ్ బాంబ్! వప్పుకుంటున్నాను. ఎంత సూపర్‌మాన్ అయినా ఎక్కడో ఒక చోట తడబడక మానడు. కరాచీని బిగించేయాలి మనం. పోలీసులకు తెలియకుండా ఒక్క యీగ కూడా కరాచీ సరిహద్దులు దాటకూడదు, బస్ డ్రయివర్లను, కండక్టర్లను హెచ్చరించండి. టాక్సీ డ్రయివర్లను కలుపుకోండి... సి.ఐ.డి. బృందాలను మారువేషాలతో పహరా ప్రారంభించమని చెప్పండి. ఇరవైనాలుగు గంటల్లో షాడోని నేలకూల్చి తీరాలి. అందుకు సహకరించిన కరాచీ పౌరులను కోటీశ్వరుల్ని చేస్తామని ప్రకటించండి..... యూ డూ వాట్ యూకెన్ డూ... నాకు కావాల్సింది ఆ షాడో తల.... అర్థం అయిందా? ఐ వాన్ట్ ఫ్లయింగ్ బాంబ్స్ హెడ్!” ఆవేశంతో అరిచాడు ఐ.జి.పి.

Preview download free pdf of this Telugu book is available at Flying Bomb