-
-
యూరోపియన్ హిందువులు
European Hinduvulu
Author: Neelamraju Lakshmi Prasad
Publisher: Vidyarthi Mitra Prachuranalu
Pages: 149Language: Telugu
ప్రపంచంలో మనుషులెందరో, మతాలన్ని వుండాలి అన్నాడు స్వామి వివేకానందుడు ఒకమారు. ఇది సత్యం. ఏ మనిషి ఏ రకమైన దుష్కర్మల ఫలితంగా ఈనాడు ఈ జన్మలో, ఈ స్థితికి వచ్చాడో, అతడి అజ్ఞానాన్ని, దుఃఖాన్ని ఈ రూపంలో సృష్టించుకున్నాడో మనకూ తెలియదు.... అతడికీ తెలియదు. అది కనుగొనడమే అతడి జన్మ కర్తవ్యం. తనని తాను చూసుకుంటూ తన నుండి ఎలాంటి గుణాలు వెలువడుతున్నాయో గమనిస్తూ, ఒక్కొక్క దాని నుండి విముక్తి చెందుతూ, సంపూర్ణ దర్శనం వద్దకు చేరాల్సి ఉంటుంది. విముక్త్యానంతరం అతడి దర్శనం ఎలా ఉంటుంది అని మనం ఊహించలేము. ఆ దర్శన భాగ్యాన్ని అతడే అనుభవిస్తాడు. రేఖామాత్రంగా మాత్రమే మనకు తెలియజేయగలిగి వుంటాడు.
భారతదేశంలోని సనాతన ధర్మం ఈ సత్యాన్ని గుర్తించింది. అందువల్లనే ఏ ‘దర్శనాన్ని’ అది తిరస్కరించలేదు. అన్నింటినీ ఆదరించింది. మనిషి శాంతస్వభావుడై, సాధుపురుషుడై, సజ్జనుడై ప్రవర్తించినంతసేపూ అతణ్ణి గౌరవించేది, అతడి దేశాన్ని గానీ, జాతినీ గానీ పట్టించుకునేది కాదు. అతడి గుణాన్ని మాత్రమే పరిగణించేది.

- ₹90
- ₹162
- ₹120
- ₹67.2
- ₹50.00
- ₹120