• Eligeelu Revised Edition
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎలిజీలు - రివైజ్డ్ ఎడిషన్

    Eligeelu Revised Edition

    Publisher: Manam Prachuranalu

    Pages: 279
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతీసారి నిష్క్రమించిన ఎందరో సన్నిహితులు, పెద్దలు, మిత్రుల జ్ఞాపకాలతో ఈ పుస్తకం మరింత బెంగనీ, దు:ఖాన్నీ పెంచుకుంటూ ఉంది.

దువ్వూరి రామిరెడ్డి గారి మాటలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుంటాను : "మనమునకెక్కినట్టి అభిమానులు మిత్రులు చెల్లినారు, యౌవన మధుమాసమున్ కుసుమ భారము రాలిపోయె...". ఈ పుస్తకంలో ప్రతీ పేజీ నా హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు! ఎంత దూరం ఈ ప్రయాణం. ఆయా వ్యక్తుల పరిచయం, సౌహార్థం అనే పుప్పొడితో ఈ జీవన మాధుర్యానికి రుచి పెరిగింది. వీరంతా ఈ జీవితాన్ని అలంకరించిన ఆప్తులు, జీవనయోగ్యం చేసిన ఓషదులు. ఈ ఆప్త వాక్యాలతో ఆయా వ్యక్తులను తలచుకోవడం ఓ నిస్సహాయమైన ఓదార్పు చరిత్రగా మిగిలే నిటూర్పు.

‘ఎలిజీ’ అంటే ఆప్త వాక్యం. ఆయా వ్యక్తుల పట్ల నా హృదయ స్పందన. అతి ఆర్థ్రమైన ఈ స్మృతి కావ్యాన్ని ఎప్పటికప్పుడు నింపుతూ, దీన్ని ఎప్పటికప్పుడు సమీకరిస్తూ - కేవలం అభిమానంతో ముద్రించే రచయిత, కవి, అత్యంత ఆప్తులు పెద్దిరెడ్డి గణేష్ గారు.

ఈయనంటాడు:
"ఆకాశానికే కాదు
అప్పుడప్పుడు ఆలోచనలకూ
అమావాస్య వస్తుంది"

ఎన్నో అమావాస్యల సంకలనం ఈ పుస్తకం. మా ఇద్దరికి సుతారమైన ‘ఆర్ధ్రత’ అనే పీటముడి ఉంది. లేకపోతే ఈ ఎలిజీలను గణేష్ కనీసం పదిహేను సంవత్సరాలుగా ఇలా గుత్తకు తీసుకోడు.

మరో ముద్రణ అంటే భయమేస్తుంది. మరెంతమంది ఆప్తులను నష్టపోతానో అని.

- గొల్లపూడి మారుతిరావు

Preview download free pdf of this Telugu book is available at Eligeelu Revised Edition