• Ekanta Seva
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏకాంత సేవ

    Ekanta Seva

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగుభాషను తమ రచనలతో సుసంపన్నం చేసిన మహాకవుల కోవకు చెందినవారు శ్రీ వేంకట పార్వతీశ్వరకవులు. అసంఖ్యాకంగా నవలలు, నాటకాలు పద్యకావ్యాలు వ్రాసి ఈ శతాబ్ది మొదటి అర్థ భాగంలో ఆంధ్ర పాఠకులకందించి ఆదరాభిమానాలు పొందిన ధన్యజీవులు వారు.
వారి గ్రంథాలన్నిటిలోనూ ఏకాంత సేవకు ఒక ప్రత్యేక విశిష్టత గౌరవం ఉన్నాయనడంలో సందేహంలేదు. ఏనాడు చదివినా ఎక్కడ చదివినా ఎవరు చదివినా ఏ వేళ చదివినా ఎలా చదివినా రాగయుక్తంగా చదివినా సామాన్యంగా చదివినా రసానుభూతి నందించగల విశిష్ట మధురభక్తి ప్రపూరిత రచన ‘ఏకాంత సేవ’.

- చిల్లర శేషగిరిరావు

‘మాట’ మనసులోని భావాన్ని ఆవిష్కరించడానికి ఒక గొప్ప సాధనం. ఇంత గొప్ప సాధనాన్ని పదునెరిగి ప్రయోగించడం మన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మాటకు చాలా ముఖాలుంటాయి. అందుకే ఒక్కొక్క మాట, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థాన్ని ఆవిష్కరిస్తుంది. సరైన అర్థాన్ని మనకి స్ఫురింపచేయలేకపోయినపుడు ఆ మాట రసాభాసను కలిగిస్తుంది. ‘ఏకాంత సేవ’ అన్నమాట వినగానే చాలా మందికి ఆలయాలలో స్వామివారికి జరిపే అర్చనాదిక సేవలలో కట్టకడపటన జరిపే పవళింపు సేవ జ్ఞప్తికి వస్తుంది. కానీ సాహిత్యంలోని ఏకాంత సేవ వేరు.
సాహితీ ప్రపంచంలో ‘ఏకాంతసేవ’ పేరును ఉటంకించగానే మనకి ఒక కవిద్వయం స్ఫురణకు వస్తుంది. ఆ కవిద్వయమే, కవికులాలంకారులు, కవిరాజ హంసలు, శ్రీ వేంకటపార్వతీశ్వర కవులు, బాలాంత్రపు వెంకటరావు, వోలేటి పార్వతీశం అనే ఇరువురు కవులు జంటగా కలసి యుగళంగా ఆలపించిన మధురభక్తి ప్రధానమైన కావ్యం 'ఏకాంతసేవ."

- వోలేటి పార్వతీశం

Preview download free pdf of this Telugu book is available at Ekanta Seva