• Egire Class Room
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఎగిరే క్లాస్ రూమ్

  Egire Class Room

  Author:

  Pages: 200
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కేస్టనర్ 1933లో పిల్లల కోసం రాసిన నవల దాస్ ప్లెయిజెండె క్లాసెస్ (ఫ్లయింగ్ క్లాస్ రూమ్) కు తెలుగు అనువాదమిది. బోర్డింగ్ పాఠశాలల్లో చదువుకునే పిల్లల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఈ నవలలో క్రిస్టమస్ డ్రామా, పిల్లల, ఉపాధ్యాయుల అనుభవాలు, అనుభూతులు హృదయానికి హత్తుకునేలా చిత్రించబడ్డాయి. మధ్యమధ్య పెద్దలు చేసే యుద్దాలమీదా, జాతీయవాదం మీదా, దేశభక్తి మీదా చేసిన వ్యాఖ్యానాలూ చెణుకులూ పాఠకులను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. జర్మనీలో నాజీలు ఇంకా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోకముందు కేస్టనర్ రాసిన చివరి రచన యిది. అయితే ఇందులో నాజీల గురించిన ప్రస్తావన ఎక్కడా స్పష్టంగా లేకపోయినప్పటికీ నవల నేపథ్యంలో కనిపించే ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, తీవ్ర నిరుద్యోగ సమస్య వంటివి జర్మన్ ఓటర్లు హిట్లర్ వైపు గంపగుత్తగా మొగ్గుచూపడానికి ఏవిధంగా దోహదం చేశాయో చాటిచెబుతాయి.

నాజీలనుంచి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యే రోజుల్లో కేస్టనర్ (1899-1974) పిల్లలకోసం ఇలాంటి నవలలు రాయడం విశేషం. నాజీలు అధికారంలోకి వచ్చీరాగానే ఈ పుస్తక ప్రతులను తగులబెట్టారు. కేస్టనర్‌ను అనేక విధాలుగా వేధింపులకు గురిచేశారు. సునిశితమైన హాస్యం, బోర్డింగ్ పాఠశాల జీవితం, గొడవలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, నాటకీయత, పాఠశాల విద్యార్థుల మధ్య కనిపించే స్నేహమాధుర్యం... అన్నింటికీ మించి "బాల్యాన్ని మరచిపోకండి” అనే ఉదాత్తమైన సందేశం పాఠకుల మనసుపై చెరగని ముద్రవేస్తాయి. పిల్లలు, తల్లిదండ్రులు, విద్యారంగంలో పనిచేసేవాళ్ళు ఈ పుస్తకాన్ని అందరికంటే మిన్నగా ఆస్వాదించగలుగుతారు.