• Eesopu Kahtalu 1
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈసోపు కథలు 1

    Eesopu Kahtalu 1

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 30
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ కుటుంబ వ్యవసాయ ఎస్టేట్ యాస్‌నాయా పొల్యానాలో పుట్టాడు. అక్కడ అతడు తన జీవితంలో అధిక భాగం గడిపాడు. అతడికి పిల్లలంటే ఎంతో ఇష్టం. తమ భూమిపై పనిచేసే వ్యవసాయకూలీల పిల్లలకోసం అతడు ఎన్నో కథలు రాశాడు.

పిల్లల కోసం అతడు రాసిన కథలు రెండు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. ఈ పుస్తకాల ద్వారా ఎంతో మంది పిల్లలు చదవటం, రాయటం నేర్చుకున్నారు. గ్రీకు, రోమను గాథలను, ఇతరుల కథలను టాల్‌స్టాయ్ తిరిగి చెప్పాడు. గ్రీకు రచయిత ఈసోపు రాసిన కథలంటే అతడికి ఎంతో ఇష్టం.

ఈసోపు కథలను టాల్‌స్టాయ్ అనువదించండంలో అవి సామెత, జానపదకథ, రోజువారి విషయాల రూపం తీసుకున్నాయి. ఈసోపు కథలకు స్థానికతను ఆపాదించడంతో అవి రష్యన్ గాథలుగా గుర్తింపు పొందాయి.

ఈసోపు కథలు సాధారణంగా ఒక నీతి వాక్యంతో ముగుస్తాయి. టాల్‌స్టాయ్ ఈ ముగింపును తీసివేశాడు. పాత్రలను, అంశాలను మాత్రం అలాగే ఉంచాడు. ఈ కథలు దేని గురించో, దీని నుంచి ఏమి నిర్థారించుకోవాలో పిల్లలు తమంతట తాము తెలుసుకోగలరన్న నమ్మకం అతడికి ఉండేది.

ఈసోపు కథలను చక్కగా అనువదించటానికి టాల్‌స్టాయ్ గ్రీకు నేర్చుకున్నాడు. ఎన్నో గాథలు చదివాడు. ఈసోపు గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రకృతి, జంతువుల భాష అతడికి తెలుసు కాబట్టి అతడు అల్పజీవి అని కొందరంటారు. క్యాంతెస్ అన్న ధనికుడి వద్ద బానిసగా ఉన్నాడు, కాబట్టి అతడి జీవితం బాధామయంగా గడిచిందని కొందరంటారు. కాని ముఖ్యమయిన విషయమేమిటంటే ఈసోపు దయాపూరితుడు, విజ్ఞుడు అయిన తత్వవేత్త. అతడి పాత్రల చర్యలు ప్రజలను నవ్వించేవి. వాళ్లు ఎంత ఎక్కువ నవ్వితే అంత విజ్ఞులుగా ఎదిగేవారు.

ఈ పుస్తకంలో అన్నిరకాల పాత్రలు ఉన్నాయి : మనుషులు, దేవుళ్ళు, జంతువులు పాత్రలు ఏవైనాగాని రచయిత ప్రధానంగా పిల్లల్ని ఉద్దేశించి ఈ కథలను చెప్పాడు. అందుకే కామోసు అతడి పాత్రలు కొన్నిసార్లు ముసుగులు వేసుకున్న పిల్లల మాదిరి అనిపిస్తాయి. చాలాసార్లు ఈ ముసుగులు జారిపోయి పిల్లల మెరుస్తున్న కళ్ళు రెండూ కనపడతాయి. ఇది బొమ్మల్లో కనపడేలా చిత్రకారుడు మిహాయిల్ రోమాదిన్ వాటిని నైపుణ్యంతో వేశాడు.