• Ee Roju Gadisthe Chalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    108
    44.44% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈ రోజు గడిస్తే చాలు

    Ee Roju Gadisthe Chalu

    Pages: 270
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాయంత్రం అయిదు గంటలయింది.

తన రూమ్‌లోంచి బయటికొచ్చింది శ్రీవింధ్య.

''ఎక్కడకు వెళ్ళాలి?'' ఆ మాట వినిపించిన దిశగా చూసిందామె ఉలిక్కిపడి.

నల్లగా, దున్నపోతులా వున్న గార్డు, వికృతమైన ముఖంతో ఆమెవేపు చూస్తున్నాడు అసహనంగా.

''కిచెన్‌కు'' చెప్పింది శ్రీవింధ్య.

''ఏం కావాలి?'' అడిగాడతను.

''టీ''

''నేను తీసికొస్తాను... మీరు లోపలికి వెళ్ళండి''

''నేను కిచెన్‌లోకి వెళ్ళి తాగుతా'' అంది శ్రీవింధ్య ధైర్యంగా.

''నో... కుదరదు అందుకు మేనేజర్‌గారి పర్మిషన్‌ వుండాలి''

''నేను మేనేజర్ని కలవొచ్చా?''

''వెళ్ళండి'' ముక్తసరిగా చెప్పాడతను.

కిందకొచ్చి మేనేజర్‌ రూమ్‌లోకి నడిచింది శ్రీవింధ్య.

''నేనిక్కడ కిచెన్‌లోకి టీ కూడా తాగకూడదా'' అలా అడుగుతున్న శ్రీవింధ్యవేపు విస్మయంగా చూశాడు మేనేజర్‌.

అతనలా ఎందుకు చూస్తున్నాడో ఆమెకర్థం కాలేదు.

ఒకింత మౌనం తరువాత-

''రూల్స్‌ ఒప్పుకోవు'' సీరియస్‌గా అన్నాడతను.

''నన్ను జైలులో వుండమని హైద్రాబాద్‌ వాళ్ళు చెప్పలేదు- నా బాధ్యతని మర్చిపోకుండా నేనెలాంటి స్వేచ్ఛ తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పారు వాళ్లు. కావలిస్తే ఫోన్‌చేసి అడగండి'' అంది కావాలనే డబాయిస్తూ.

Preview download free pdf of this Telugu book is available at Ee Roju Gadisthe Chalu