• Ee Reyi Needoei
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఈ రేయి నీదోయి

    Ee Reyi Needoei

    Pages: 222
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇదిగో ఇలాంటప్పుడు సుబ్బరామయ్య నా దగ్గరికి వచ్చాడు.

“వాడి వాలకం చూస్తుంటే ఏదో భయంగా వుంది. ఎప్పుడూ ఏదో ధ్యాసలో వుంటున్నాడు.ఈ ప్రపంచాన్ని గురించి పట్టించుకోవడం లేదు. వయసులో వున్న కుర్రాడు. ఏదయినా ఆకర్షణలో చిక్కుకుంటే వాడి జీవితం నాశనమైపోతుంది. నిజంగా వాడికి ఏమయిందో నువ్వు కనిపెట్టాలి” అన్నాడు.

అప్పటివరకు నాకూ గోకుల్ గురించి ఏమీ తెలియదు. పెద్దింటి బిడ్డ- చదువుకున్నాడు- వయసులో వున్నాడు గనుక ఆకర్షణీయంగా వుంటాడు- ఇంతవరకే తెలుసు. అతని వ్యక్తిగత జీవితం గురించి వివరాలు తెలియవు.

“వాడికి ఏమైందో నువ్వు కనిపెట్టాలి- నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను” అన్నాడు ఆవేశంతో.

“నేను చేసే వృత్తి అదే. ఏం జరుగుతూ వుందో తెలుసుకుంటాను తప్ప బెత్తం ఎత్తుకుని ఇతరులను బాగు చేయడమంటే నాకు ఇష్టం లేని పని. ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బతకటమే జీవితం యొక్క పరమావధి అని నమ్మిన దాన్ని” అన్నాను.

“సరే- నువ్వు అంతవరకే చెయ్” అని ఆయన లేచాడు.