• Edi Nadi Kadu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఏదీ నాది కాదు

    Edi Nadi Kadu

    Publisher: S.J.K. Publications

    Pages: 30
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description


రావురి భరద్వాజ గారి కవితానికలు "ఏదీ నాది కాదు".


"నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?" అన్నారు ప్రభువు ఉదయపు నడకలో
"అసంతృప్తి" అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
"ఉన్నచోటనే ఉండిపొమ్మంటుంది సంతృప్తి. మునుముందుకు నడిపిస్తుంది అసంతృప్తి" అన్నాను.
ప్రభువు - నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.

* * *


ఒక వాక్యంలోని అర్థం నలుగురికీ నాలుగు రకాలుగా ఎందుకు గోచరిస్తుంది?
ఒక సన్నివేశం తాలూకు నేపథ్యం, పదిమందికీ పదిరకాలుగా ఎందుకు అనిపిస్తోంది?
ఒక దృశ్యంలోని అంశం, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఎందుకు కనిపిస్తుంది?
ఆ వాక్యంలోనూ సన్నివేశంలోనూ, దృశ్యంలోనూ భిన్నత్వం ఉండడమే అందుక్కారణమా?
లేకపోతే - ఆ వాక్యాన్ని చదివిన వారి సంస్కారం, ఆ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని చూసిన వారి సంస్కారం కారణమా?
కాకపోతే, వారెన్నుకొన్న దృక్కోణాలు కారణమా? కాక - ఇవన్నీ కారణమా?

* * *

Preview download free pdf of this Telugu book is available at Edi Nadi Kadu