• Dushta Panchayati
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 91.8
    108
    15% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దుష్ట పంచాయితి

    Dushta Panchayati

    Publisher: Palapitta Books

    Pages: 184
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దుష్ట పంచాయితి - మరికొన్ని నాటకాలు

సామాజిక జీవితంలో సాధారణంగా కనిపించే అంశాల్లోని లోతునీ, తీవ్రతనీ చర్చిస్తూ ఉత్తమమైన నాటకాలను రాశారు ఒద్దిరాజు సోదరులు. వారు రాసిన నాటకాలు మూడు పుస్తకాలుగా లభిస్తున్నాయి. వాటిల్లో ఒకటి మగసంసారం. రెండోది 'మేనరికం' మరికొన్ని నాటకాలు. ఇది మూడో పుస్తకం. దీనిలో దుష్ట పంచాయితి, జమీందారీ తౌరు, ఎఱువు సొమ్ము, రాణా ప్రతాపసింహుడు అనే నాటకాలున్నాయి.

ఊళ్ళల్లో పంచాయితీలు నడిచే తీరు బోధపడుతుంది - దుష్ట పంచాయితి నాటకం చదివితే. కాగా జమీలు పోయినా, జమీందార్ల సంస్థానాలు పోయినా వారి దర్జా మాత్రం పోలేదు. అలనాటి వైభవాన్ని ప్రదర్శించ పూనుకుంటారు. ఇది మానవ స్వభావంలోని ఒక వైచిత్రి.

ఎఱువు సొమ్ము కూడా ఒక చిత్రమైన నాటకం. తమకు లేని దర్జాకు పోతే వచ్చే తిప్పల గురించిన వైనం ఇందులో ఉంది. డాబుసరికి పోకూడదన్న నీతి ఉంది. తమకు ఇష్టం లేనప్పుడు, లేదని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. విభిన్న వ్యక్తులు విభిన్న సందర్భాలలో వ్యవహరించే తీరుతెన్నులు ఈ నాటకంలో చూడొచ్చు.

రాణా ప్రతాపసింహుడు నాటకం దేశభక్తికి సంబంధించిన ఆలోచనలని ప్రోది చేస్తుంది. ధన, మాన ప్రాణాల కన్నా దేశభక్తి, ఆత్మగౌరవం ఎంతో ముఖ్యమని ప్రవచించే ఇతివృత్తం ఈ నాటకాన్ని రక్తి కట్టించింది.

ఈ నాలుగు నాటకాల సముదాయమే ఈ పుస్తకం. ప్రదర్శనాయోగ్యమే కాదు, పఠన యోగ్యమైన నాటకాలివి.

Preview download free pdf of this Telugu book is available at Dushta Panchayati