• Dual At Double Rock
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డ్యూయల్ ఎట్ డబుల్ రాక్

    Dual At Double Rock

    Author:

    Pages: 113
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

"విమాన ప్రమాదంలో మాయమైపోయిన తితోవిచ్ జాడలు నీకు తెలుసని నాకు యిన్ఫర్మేషన్ అందింది" సూటిగా అసలు విషయంలోకి దిగాడు షాడో.

రొమాన్స్ రెస్టారెంట్‌కి రెండు ఫర్లాంగుల దూరంలో వుంటుంది హైడీ పార్కు. పార్కు మధ్యలోవున్న పెద్ద చెట్టు క్రింద కూర్చుని గడ్డిపరకల్ని కొరుకుతున్నాడు అబూ. షాడో మాటలకు చిన్నగా నవ్వి జేబులోనుంచి ఒక పోటోను తీసి అతని ముందు పడేశాడు.

అతను దాన్ని జేబులోనుంచి తీస్తున్న సమయంలోనే ఆ ఫోటోలోని తితోవిచ్ ముఖాన్ని గుర్తుపట్టేశాడు షాడో. ఆ విషయాన్ని వెంటనే బయటపెట్టకుండా, ఫోటోని చేతుల్లోకి తీసుకొని పరిశీలనగా చూసినట్లు నటించి తలవూపాడు.

"తితోవిచ్ యిక్కడికి సమీపంలోనే వున్నాడు.... సరయిన ధరయిస్తే అతను మీకు లభ్యమౌతాడు" తను కూడా సూటిగా అసలు విషయంలోకి దిగాడు అబూ.

ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నాడు షాడో. రెండు క్షణాలు సీరియస్‌గా అతని ముఖంలోకి చూసి తల వూపాడు.

"తితోవిచ్‌ని రష్యన్ బోర్డర్లు దాటించి తీసుకురావటానికి చాలా ఖర్చయింది... సో... పదిమిలియన్ అమెరికన్ డాలర్లు యిస్తే అతన్ని మీకు అప్పగిస్తాను..." గడ్డి పరకల్ని నమలటం ఆపి, పాంటు జేబులో వున్న విస్కీ ప్లాస్క్‌ను బయటికి తీస్తూ అన్నాడు అబూ.

Preview download free pdf of this Telugu book is available at Dual At Double Rock
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.