-
-
డా. వేటూరి సుందరరామమూర్తి నవరస గీతాలు
Dr Veturi Sundararama Murthy Navarasa Geetalu
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 604Language: Telugu
అలలు కదిలినా పాటే, ఆకుమెదిలినా పాటే ఏ పాట నేరాయను బ్రతుకే పాటైన పసివాడను అని పాడుకున్న జీవన పాటసారి డాక్టర్ వేటూరి సుందరరామమూర్తి. మనసు మాటకందనినాడు మధురమైన పాటవుతుంది. మధురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది అన్న ఆ మనిషి, “కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మహాపురుషులౌతారు, తరతరాలకి తరగని వెలుగౌతారు, ఇలవేలుపులౌతారు” అనే అజరామరమైన పల్లవులతో ఎన్నోవేల పాటలు రచించి పాటలీపుత్ర రారాజుగా, తెలుగు సినీగేయకవితావన వసంతమూర్తిగా, ఒక యుగకర్తగా, ట్రెండ్‌సెట్టర్‌గా పండితపామర జనులందరిచేతా ప్రశంసించబడి విశ్వవిఖ్యాత పాటల రచయితగా మనీషిగా నిలిచారు.
1974లో సినీపరిశ్రమలో ప్రవేశించిన శ్రీ వేటూరి ఓ సీతకధ చిత్రంలో “భారతనారిచరితము” అనే హరికధతో తన గేయరచనా ప్రస్థానాన్ని ప్రారంభించి 2010 వరకూ దాదాపు 5500 పై చిలుకు పాటలు రాసి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ అందుకోలేని స్థానాన్ని సంపాదించారు. లక్షల సంఖ్యలో వున్న వారి అభిమానులందరికీ ఆయన రచించిన సుప్రసిద్ద గీతాల్ని అందించాలనే ఆశయంతో వారి పాటల తోటలోని 601 గీతకుసుమాలని మీకందిస్తున్నాం.
రసహృదయులైన వేటూరి అభిమానులందరినీ ఈ పాటలీ కుసుమ పరిమళాలు అలరిస్తాయని ఆశిస్తూ... మీ విలువైన సలహాలు, సూచనలు కోరుతూ...
- డా. జయంతి చక్రవర్తి

- ₹64.8
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹60