• Doorateeralu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దూరతీరాలు

    Doorateeralu

    Author:

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎవరి జీవితంలోనైనా సమస్య మొలకెత్తిందంటే ఊబిలో అడుగు పడినట్లే. సమస్యలో చిక్కుకున్న వారి హితులు వారిని ఆ ఊబి లోంచి బయటకి లాగేందుకు ప్రయత్నిస్తే, సమస్యకు కారణమైనవారు ఊబి వైపు లాగుతూంటారు. సమస్యలో చిక్కుకున్న వ్యక్తి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యటానికి ప్రయత్నించినా, తెలియకుండానే తడబడ్డ అడుగులు ఊబిలోకి లాగే ప్రమాదమూ ఉంది. ఈ అంశాలన్నీ కనబడ్డాయి నాకీ నవలలో.
వివాహేతర సంబంధం సృష్టించిన ప్రకంపన ఈ నవల. వ్యక్తుల రకరకాల సందర్భాలలో, అప్పటి అవసరాల కోసం ఎలా రాజీపడతారో, ఎలా ఓర్పుగా ఉంటారో, ఎలా స్వార్థపరులవుతారో, ఎలా నిస్సహాయులవుతారో, ఎలా వాళ్ళు వాళ్ళు కాకుండా పోతారో తెలియజెప్పే నవల ‘దూరతీరాలు’.

- వేమూరి సత్యనారాయణ

*****

దాసరి శిరీషగారు రాసిన ‘దూరతీరాలు’ నవల దాదాపు పాతికేళ్ల క్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా వచ్చి, అనేక మంది పాఠకుల ఆదరణ పొందింది. ఒక వివాహితుడికి, ఒక అవివాహితతో ఏర్పడిన సంబంధం ఏ విధంగా వారి జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించిందో ఈ నవల చెబుతుంది.
పాతికేళ్లనాటి సమాజాన్ని ఈ నవలలో సహజంగా, అందంగా ఆవిష్కరించారు రచయిత్రి. నవల చదువుతుంటే ఆ కాలంలోకి వెళ్లిపోతాము. చదువుకుని, ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడిన స్త్రీలను ఈ నవలలో చూస్తాం. విద్యావంతులైన కొందరు దంపతులు మిగిలిన వారికంటే భిన్నంగా స్నేహితులు, సరదాలు మధ్య స్వతంత్య్రమైన ఆలోచనలతో, విశాల దృక్పథంతో ఆదర్శవంతంగా జీవించటం కనిపిస్తుంది. అలాటి ఒక జంట కథే ఇది.

- నాదెళ్ళ అనూరాధ

Preview download free pdf of this Telugu book is available at Doorateeralu