• Donga Dadi Katha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దొంగదాడి కథ

    Donga Dadi Katha

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Pages: 254
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దొంగదాడి కథ

1955 ఎన్నికలు చారిత్రిక వాస్తవాలు

1955 నాటి ఆంధ్రదేశంలోని శాసనసభ మధ్యంతర ఎన్నికల చర్చలు, వాదోపవాదాలు ఇప్పుడెందుకు? ఇవన్నీ చారిత్రకాంశాలు కదా! వాటికుండేది చారిత్రక ప్రాధాన్యతే కదా! అలాంటప్పుడు ఇంతటి ఉద్గ్రంధం దేనికన్న ప్రశ్న తలెత్తడం ఎంతైనా సమంజసం.

నాటి ఎన్నికలలో సాగినది వట్టి రాజకీయ చర్చ అయితే ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఎన్నికల్లో పాల్గొన్న రాజకీయ పక్షాలు, వాటి ప్రణాళికలు ఆధారంగా చర్చ సాగించి ఉంటే దానిలో విశేషమేమీ కనిపించదు. అది సర్వ సాధారణమనుకుంటాం. వర్గ రాజకీయ నేపథ్యంలో ప్రత్యక్ష పోరును ఎవరైనా గమనించవచ్చు.1955 నాటి ఆంధ్రలోని శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో ఐక్య కాంగ్రెస్ కూటమి, భారత కమ్యూనిస్టు పార్టీల మధ్య జరిగిన ప్రత్యక్ష రాజకీయ పోరును ఎవరైనా చూడవచ్చు.

కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆచరణపై వచ్చిన విమర్శలు పరిశీలనార్హమే. కాని విమర్శ లక్ష్యం, దిశ, దాని పరమార్ధమేమిటన్న విషయం మరింత పరిశీలనార్హం. ఈ దిశగా చూసినప్పుడు 1955 నాటి ఆంధ్రలోని శాసనసభ మధ్యంతర ఎన్నికల పూర్వరంగంలో జరిగిన 'సాహితీచర్చ' చర్చ అనడం కంటె సాహితీ దాడి, దాని రాజకీయ, వర్గ లక్ష్యం స్పష్టమౌతుంది. ప్రజాభిప్రాయ రూపకల్పనకు, ప్రజామోదం పొందటానికి సాహితీరంగం ఏ విధంగా భావజాలపోరుకు ఆలంబనగా మారిందో 1955నాటి చర్చ విశదపరుస్తుంది. అందుకే ఈ గ్రంధం చదవండి.

* * *


నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు....

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే...

Preview download free pdf of this Telugu book is available at Donga Dadi Katha
Comment(s) ...

తెలుగు రాజకీయాలు, తెలుగు సాహిత్య రాజకీయాలు, చరిత్ర, సాహిత్య చరిత్రలపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవ వలసిన పుస్తకం ఈ దొంగదాడి కథ.
- Jampala Chowdary on పుస్తకం డాట్ నెట్