• Doctor Srikar M B B S
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డాక్టర్ శ్రీకర్ (M.B.B.S)

    Doctor Srikar M B B S

    Author:

    Pages: 202
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జమీలా దెబ్బకు తన కళ్ళు బైర్లు క్రమ్మి అలా కనిపిస్తోందేమో అనే అనుమానంతో కళ్ళు నులుముకుని మరీ చూశాడు శ్రీకర్.

బైర్లు క్రమ్మలేదు అతని కనులు ... భ్రమ పడటం లేదు అతని మనస్సు. పిడిబాకుల్ని పట్టుకున్న దృఢకాయులకు దొరకకుండా గుడ్డిగా పరుగులు తీస్తోంది ఆ యువతి. శ్రీకర్ చూస్తూ వుండగానే పొరపాటున ఒక గోతిలో కాలువేసి ముందుకు తూలింది.

"పట్టుకో...ఈసారైనా పారిపోకుండా గట్టిగా పట్టుకో..." తన సహచరుడిని హెచ్చరిస్తూ మరింత వేగంగా ముందుకు దూకాడు ఒక దృఢకాయుడు.

గోతి అంచున వున్న గులకరాళ్ళు తగిలి కొట్టుకు పోయిన మోచేతుల్ని రుద్దుకుంటూ లేచి నిలబడింది ఆ యువతి.

"కమాన్ బేబీ...కమాన్..." బిగ్గిరిగా అరిచి ఆమెను హెచ్చరించాడు శ్రీకర్. అడ్డు వచ్చిన బండల మీదినుంచి జంప్ చేస్తూ మైదానంలోకి దిగాడు.

పోతున్న ప్రాణాలు లేచి వచ్చినట్లు గిర్రున గుట్టవైపు తిరిగిందామె. ఊహించరాని వేగంతో శ్రీకర్ దగ్గిరికి వచ్చేసింది.

"గుట్ట అవతల కుంకుడు చెట్లున్నాయి...వాటి క్రిందికిపోయి రెస్ట్ తీసుకో...నీ ప్రాణాలకు వచ్చిన భయం ఏమీలేదు బేబీ...కమాన్... మూవ్..." అంటూ ఆమె చేతిని అందుకొని గుట్టమీదికి నెట్టాడు శ్రీకర్.. తను ముందుకు పోయి, బ్రహ్మరాక్షసుల్లా వస్తున్న దృఢకాయుల్ని ఎదిరించాడు.

దెబ్బతిన్న ఎనుబోతుల్లా రంకెలు వేసి ఒకేసారి విసిరారు వాళ్ళు, తమ చేతుల్లో వున్న పిడిబాకుల్ని.

కందిరీగల్లా ఝంకారం చేస్తూ వచ్చిన ఆ బాకులకు అందకుండా చటుక్కున ముందుకు వంగి తప్పించుకున్నాడు శ్రీకర్. అదే వూపులో పైకిలేచి ఎగిరి దూకాడు ఒకతని గుండెలమీదికి.

ఊపిరి ఆగిపోయినంత పని కాగా, వెనక్కి తూలి వెల్లకిలా పడిపోయాడు అతను. పూర్తిగా పడక ముందే అతని పాంటు బెల్టును పట్టుకొని ఆపేశాడు శ్రీకర్. అమాంతంగా గాలిలోకి ఎత్తి రెండో దృఢ కాయుడి మీదికి విసిరాడు.

ఇసుక మూటలా వచ్చి పడిన తన సహచరుడి పాదాలు ముఖానికి పొడుచుకొని, వెర్రిగా అరిచాడు రెండో దృఢకాయుడు. ముఖాన్ని చేతులతో కప్పుకుంటూ, మోకాళ్ళ మీదికి వరిగిపోయాడు.

అటూ ఇటూ చూసి, ఒక పెద్ద కొండరాయి మీద చేతులు వేశాడు శ్రీకర్. ఊపిరి బిగపట్టి దాన్ని గాలిలోకి ఎత్తబోతుండగా గమనించాడు మొదటి దృఢకాయుడు.

ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా లేచి నిలబడి, తన సహ చరుడిని కూడా పైకి లాగాడతను. కూడ బలుక్కున్నట్లు ఒకేసారి వెనుతిరిగారు యిద్దరూ. పెద్ద పులి ఏదో వెంటపడి తరుముతున్నట్లు పరుగులు తీసి మైదానం చివర వున్న పొదల్లోకి వెళ్ళిపోయారు.

పైకి ఎత్తిన బండను క్రింద పడేసి చేతులు దులుపు కున్నాడు శ్రీకర్.

Preview download free pdf of this Telugu book is available at Doctor Srikar M B B S