• Diwakara Prabha
  • Ebook Hide Help
    ₹ 36
    60
    40% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దివాకర ప్రభ

    Diwakara Prabha

    Publisher: Yuva Bharathi

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దివాకర్ల వేంకటావధానిగారికి గొప్పవక్తగా, ఉపన్యాసకునిగా ఎనలేని కీర్తి వుంది. ముఖ్యంగా విద్యార్థులలో తెలుగు సాహిత్యంపట్ల అభిరుచిని పెంచి, ఎందరెందరినో సాహితీ ప్రియులుగా, సాహితీ వేత్తలుగా మలచిన ప్రభావశీలురు ఆయన. ఆయన రాసిన 'ఆంధ్రవాఙ్మయ చరిత్ర' వంటి గ్రంథాలు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకై రాసిన పాఠ్యగ్రంధాలు,'గైడ్స్‌' ఎందరికో 'రిఫరెన్స్‌ బుక్స్‌' అయ్యాయి. ఆయన చేసిన అనేక రచనలు సాహితీ లోకానికి పరామర్శ గ్రంథాలుగా నేటికీ రాణిస్తున్నాయి. నలభైకి పైగా గ్రంథాలు వెలువరించిన దివాకర్ల వేంకటావధానిగారు కవిగా నన్నయ మార్గంలో పద్యరచన చేసినవారు.

విశ్వనాథ సత్యనారాయణ శిష్యులుగా దివాకర్ల వారు - విశ్వనాథ 'ఏకవీర' నవలను ఆయన చెబుతుండగా రాసిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. డా. సి. నారాయణ రెడ్డి వంటి నేటి ఎందరో మహనీయ సాహితీ దిగ్దంతులకు దివాకర్లవారే గురువు అన్న విషయమూ కొందరికి తెలియకపోవచ్చు. దివాకర్ల వారి విశిష్టతలను డా. తిరుమల శ్రీనివాసాచార్యగారు ఈ పద్యకావ్యంలో బహుధా వర్ణించారు. దివాకర్ల వారి జీవితాన్ని గురించి పూర్తివివరాలతో వచనరచననూ ఈ గ్రంథంలో సంతరించడం జరిగింది. పద్యకావ్యంలో శతాధి కపద్యాలలో తిరుమల శ్రీనివాసాచార్యగారు శతజయంతి సాహితీమూర్తి దివాకర్లను రస సముచితంగా రూపుకట్టించారు. పద్యంలో జీవితవిశేషాలను ఇలా హృదంగా చెప్పగలగడం ఆచార్యులవారి ప్రజ్ఞే! అసలు అవధానిగారి జీవితమే ఒక ఖండ కావ్యంగా తోస్తుంది కనుకనే ఈ కృతి - ఆకృతి దాల్చిందేమో!

దివాకర్ల వారి శతజయంతి సందర్భంగా ఆయన ఉపన్యాసపరంపరలతో వృద్ధి చెందిన యువభారతి ఆయనపై ఇలా ఓ పద్యకావ్యాన్ని తన ప్రచురణగా తీసుకురావడం ఎంతో సంతోషంగా వుంది. దివాకర్లవారి వ్యక్తిత్వ కవిత్వాలను శ్లాఘిస్తూ, వారి జీవితచరిత్రకు ఈ పద్యకావ్య రూపమిచ్చినవారు యువభారతి గౌరవాధ్యక్షులు డాక్టర్‌. తిరుమల శ్రీనివాసాచార్యగారు.

Preview download free pdf of this Telugu book is available at Diwakara Prabha