-
-
ధ్యానం శరణం గచ్ఛామి
Dhyanam Saranam Gachchami
Author: Swami Maitreya
Pages: 372Language: Telugu
‘ధ్యానం శరణం గచ్ఛామి’ అనే ఈ పుస్తకంలో ధ్యాన విశిష్టతను గూర్చి సవివరంగా తెలుపుతూ, దానికి అనుబంధంగా చేయవలసిన ప్రక్రియలనూ, జీవన విధానాన్ని గురించి కూడా తెలుపడం జరిగింది. పుస్తకాన్ని ఆరు అధ్యాయాలుగా విభజించడం జరిగింది.
మొదటి అధ్యాయం ‘మనసు-ధ్యానం’ లో మనసు ధ్యానానికి అవరోధాలను ఎలా కలిగిస్తుందో తెలుపుతూ, వాటిని అధిగమించడానికి అనుసరించవలసిన విషయాలను సవివరంగా వివిధ వ్యాసాలలో పొందు పరచడం జరిగింది.
రెండవ అధ్యాయం ‘యోగ -ధ్యానం’ లో యోగ సాధన అంటే ఏమిటి? అష్టాంగ యోగాలు ధ్యానానికి ఎలా ఉపకరిస్తాయో తెలపడం జరిగింది. మూడవ అధ్యాయం ‘ధ్యాన పద్ధతుల’లో ఆరోగ్యపరంగా ప్రామాణికమైన ప్రజ్ఞాచక్షు ధ్యానం, హృదయ ధ్యానం, టిబెట్ ధ్యానం, టావో ధ్యానం, జెన్/జాజెన్, అవగాహనా ధ్యానం, అజప జప లాంటి వివిధ ధ్యాన పద్ధతుల వివరం ఉంది. ఈ ధ్యాన పద్ధతులనన్నిటినీ పాఠకులు, సాధకులు సాధన చేయాలేమోనని బెంగ పడవద్దు. మీకు అనుకూలమైనవి, ఆచరణీయమైనవి మాత్రమే సాధన చేసుకుని, వాటి విశిష్టతను స్వీయానుభవంతో తెలుసుకుని అనుసరించవలసినదిగా మనవి.
ఇక, నాలుగవ అధ్యాయంలో ప్రశాంతత చేకూరి, అంతర్ముఖులు కావడానికి ఉపకరించే పద్ధతుల వివరం ఉంది.
ఐదవదైన ‘మహా గురువుల బోధనలు’ అనే అధ్యాయంలో కృష్ణుడు, శివుడు, బుద్ధుడు, క్రీస్తుల బోధనలు చర్చించడం జరిగింది. ఏ గురువు చెప్పినా వారి బోధనలోని సారం ఒక్కటే. అదేమిటంటే, అశాశ్వతమైన శరీరం, మనస్సులతో అంటిపెట్టుకునే తత్వాన్ని విడనాడి, ధ్యానసాధనతో బంధాలనుండి విముక్తులవడమే.
చివరిదైన ఆరవ అధ్యాయంలో ‘మైత్రేయ ధ్యాన పద్ధతుల’ వివరం ఉంది. వాటి విశిష్టతను గుర్తించి, అనుసరించి అందరూ విముక్తిని పొందాలని ఆకాంక్ష.
