• Dharmapatham
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ధర్మపథం

    Dharmapatham

    Pages: 221
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనం కంప్యూటర్‌ యుగంలో జీవిస్తున్నాం. యిది వైజ్ఞానిక యుగం. మానవ జీవితం విజ్ఞాన శాస్త్రం ఆధారంగానే ముందుకు సాగుతోంది. విజ్ఞానశాస్త్రం పరిధిలో నిగ్గు తేలని ప్రతీ అంశాన్నీ మూఢ విశ్వాసం కింద జమ కట్టేస్తున్నారు. దీనికి ఈనాటి ఆధునిక మానవ మనస్తత్వాలు మాత్రమే కారణం అని చెప్పటం సరయింది కాదు. మొబైల్‌ ఫోన్‌లలో మాట్లాడుతూ ఎ.సి. కార్లలో తిరిగే బాబాలు, ధార్మిక గురువులు, విద్యావేత్తలు ఈ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. యిటువంటి దయనీయమయిన వాతావరణంలో, మన మత విశ్వాసాల పునాదుల కింద దాగివున్న అమూల్యమైన విజ్ఞానశాస్త్ర వాస్తవాలు ప్రపంచానికి ఎలా తెలుస్తాయి?

జ్ఞానానికి సంబంధించిన ఈ లోపాన్ని సరిదిద్దేందుకు మనం మతం పునాదులను గురించీ, దాని మౌలిక స్వరూపాన్ని గురించీ తెలుసుకోవటం అవసరం. అప్పుడు మాత్రమే మనం మన ధార్మిక విశ్వాసాలలో దాగివున్న వైజ్ఞానిక రహస్యాలను సరైన రీతిలో అర్థం చేసుకోగలం. రాబోయే తరాలవారికి వాటిని మరింత సుబోధకం చేయగలం.

* * *

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో గుర్తించదగిన వాస్తవం ఒకటి వుంది. హిందూ ధర్మానికి సంబంధించిన సున్నితమయిన, లోతైన అంశాలను గురించి జర్మనీ, చైనా, అమెరికా దేశాల్లో జరిగినంత పరిశోధన మన దేశంలో జరగలేదు. జర్మనీ, చైనా దేశాలవద్ద వున్నన్ని ప్రాచీన భారతీయ వ్రాతప్రతులు మన దేశంలో లేవు. పటిష్టమైన విజ్ఞానశాస్త్ర పునాదుల మీద నిలబడి వుంది మన హిందూ ధర్మం. యిది నిజం. వేల వేల వత్సరాల మానవ జీవన సారమే హిందూ ధర్మం. దానిని అర్థం చేసుకోవటం ఈ తరానికే కాదు అన్ని తరాలవారికీ అవసరం. కేవలం యిది మనకు మాత్రమే కాదు. సమస్త మానవ జాతికీ మౌలికమయిన అవసరం.

ఆ అవసరాన్ని గుర్తించి, దాన్ని తీర్చేందుకు రూపొందించిన రచనల సమాహారమే మీ ముందున్న ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Dharmapatham