• Deepam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దీపం

    Deepam

    Pages: 132
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఈ సంకలనంలో 18 స్త్రీవాద కథలున్నాయ్. ఇవి అన్నీ ప్రముఖ స్త్రీవాద రచయిత్రులు, రచయితలు, 1948 నుండి 2017వరకు వ్రాసినవి. ఒక్కొక్క కథలో రచయితలు ఆనాటి సాంఘికపరిస్థితులు, స్త్రీలపై మతం విధించిన అణచివేత, దోపిడీ, అలాగే పురుషుల వలన స్త్రీలు కుటుంబ, సమాజ ఆధిపత్య, అణచివేతకు గురవటంలాంటి సమస్యలను సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాతక్రమంలో, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కారణంగా స్త్రీల జీవితాలలో మార్పులు రావటం; ఆర్థిక, రాజకీయ, సాంఘిక విద్యా రంగాలలో స్త్రీ, పురుషులకు సమాన హక్కుల కోసం ప్రయత్నాలు, ఉద్యమాలు, స్త్రీ విద్యతో పితృస్వామ్య వ్యవస్థ పునాదులలో కదలికలు, స్త్రీలకు వయోజన ఓటుహక్కు, తల్లి, కుమార్తె, వితంతువులకు వారసత్వ హక్కులు, ముఖ్యంగా ఆడది తల్లి, భార్య, చెల్లిగా మాత్రమే ముద్ర వేయబడే ఒక లేబుల్ నుండి, మనిషిగా గుర్తింపబడే స్థాయికి ఎదగటం, ఇలా 19వ శతాబ్దంలో స్త్రీ వాద పరిణామ క్రమం చిత్రీకరించబడింది.

19వ శతాబ్దం ఆఖరుకు, 20వ శతాబ్దం నుండి, విద్య, ఆర్థిక, సాంఘిక రంగాలలో స్త్రీల జీవితాలలో పెనుమార్పులు సంభవించాయి. స్త్రీలు విద్యారంగంలో దూసుకుపోవటం, ఉద్యోగరంగంలో మగవారితో పోటీపడటం, సమాన హక్కులు అంటూ ధూమ మద్యపానాలకు అలవాటుపడి, భర్త కుటుంబసభ్యులతో ఘర్షణ పడటం, వింటున్నాం, చదువుతున్నాం.

వివాహ విషయాలలో విప్లవభావాలతో కుల, మత విభేదాలను విస్మరించి నచ్చిన వారితో నడవటం, కోర్టుల కెక్కడం, మనోవ్యధలతో మంచాన పడటం, శృతిమించి ఆత్మహత్యల పాలవటం, ఒంటరి బ్రతుకు వెళ్ళదీస్తున్న వనితలు, రద్దయిన పెళ్ళిళ్ళకారణంగా శాపగ్రస్తులవుతున్న సంతానం భవిష్యత్తు, విదేశాలకు విద్యలకు, ఉద్యోగాలకు వెళ్ళినయువత తిరిగిరాని కారణంగా, వారితల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసికక్షోభలు -ఆ 18 మంది తమ రచనల ద్వారా, ఇలా అన్ని కథాంశాలను తీసికొని, మీ ముందుంచారు.

- నన్నపనేని అయ్యన్‌రావు

Preview download free pdf of this Telugu book is available at Deepam