-
-
డెత్ మెసెంజర్
Death Messenger
Author: N S Nagireddy
Pages: 131Language: Telugu
''వాట్ బ్రదర్... ఏదో కొత్త న్యూస్ చెబుతున్నావే...?'' అన్నాడు దుబాసీ కళ్ళు చికిలించి.
''మై డియర్ దుబాసీ... ! నన్ను ఇండియా నుంచి డెత్ మెసెంజర్ అనే వ్యక్తి వార్న్చేస్తూనే వున్నాడు. శామ్యూల్‌గా నా జర్నీ ఎవరికీ తెలియదు. కానీ డెత్ మెసెంజర్‌కి తెలిసిపోయింది. నేను ప్లయిట్ ఎక్కకముందే బెదిరించాడు. బహుశా అతను కె.జి.బి.కి మెసెజ్ పాస్ చేసి వుండలి. నేను గెస్ట్హౌస్లోంచి బయటకు రాగానే నన్ను పట్టుకోబోయారు ఆర్మీగార్డ్స్. నేను తప్పించుకుని ఇక్కడకు వచ్చాను.''
''ఆ డెత్ మెసెంజర్ ఎవరయి వుంటాడు?'' సాలోచనగా అడిగాడు దుబాసీ.
''అదే నా వూహాకు అందడంలేదు. ఇక ఆ విషయం వదిలేయ్.... సమయం వచ్చినప్పుడు అదే బయటపడ్తుంది. దేశ్‌పాండే గురించి చెప్పు !''
''దేశ్‌పాండే తను సేకరించే రహస్యాలన్నింటిని కె.జి.బి.కి అమ్మేవాడని నీకు తెలిసే వుంటుందిగా బ్రదర్ ! కనుక దేశ్‌పాండే బరువు బాధ్యతలు ప్రస్తుతం కె.జి.బి.యే చూసుకుంటోంది. నామ్టామ్కి కొద్ది దూరంలో కె.జి.బి.కి సీక్రెట్ ఛాంబర్స్ ఉన్నాయి. ఇలా పారిపోయి వచ్చిన డిఫెక్టర్స్ని ఎక్కువగా ఆ సీక్రెట్ ఛాంబర్స్‌లోనే వుంచుతారు. మరో విషయం. ఆ ఛాంబర్స్ కె.జి.బి ఆధ్వర్యంలో వున్నాయన్న సంగతి కూడ బయటకు రానివ్వరు. అంతేకాదు. ఆ సీక్రెట్ ఛాంబర్స్ చుట్టూ జి.ఆర్.యు. గార్డ్స్ రాత్రింబవళ్ళు కాపలా కాస్తుంటారు. కంటికి రెప్పలా చూసుకుంటారు లోపలవున్న వారిని. రేపు ఉదయం కె.జి.బి. డెప్యూటీ ఛైర్మన్వచ్చి దేశ్‌పాండేని కలుసుకుంటాడని తెలిసింది. అతను విశ్వసిస్తే మాస్కోలోని క్రెమ్లిన్ హౌస్‌కి దేశ్‌పాండేని తీసుకెళతారు."
''నాకు అందిన సమాచారం ఇదీ బ్రదర్! ఆ తరువాత నువ్వేం చేసుకున్నా సరే! నీవల్ల ఏదయినా అవుతుందనుకుంటే చూసుకో! లేదంటే గెస్ట్‌హౌస్‌కి పోయి రెస్ట్ తీసుకో!''
