• Dear
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    84
    28.57% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డియర్

    Dear

    Pages: 190
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాంబాబు కాలేజీకి బయలుదేరాడు.

దారిలో ఓ బస్‌స్టాప్‌ దగ్గర తనతోపాటే చదివే సుందరి నిలబడి బస్‌ కోసం ఎదురుచూస్తోంది. ఆ బస్‌స్టాప్‌లోనే రోజూ రాంబాబు బాబ్జీని పికప్‌ చేసుకుంటాడు.

రాంబాబు బాబ్జీ కోసం బైక్‌ స్లో చేసి చుట్టూ చూస్తుండగా సుందరి పరిగెత్తుకుంటూ వచ్చి ''లిఫ్ట్ ప్లీజ్‌'' అంది.

రాంబాబు ముఖం చిట్లించి చూసి తలవిసురుగా అటు తిప్పుకున్నాడు.

''ఉత్త బుద్ధావతారం...'' అంటూ బస్‌స్టాప్‌లోకి నడిచింది.

గుర్రుగా చూసాడు ఆ మాటలు విన్న రాంబాబు.

ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న బాబ్జీ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

''ఎక్కు వెళదాం. నీ కోసమే ఎదురు చూస్తున్నాను'' అన్నాడు రాంబాబు.

తలకొట్టుకున్నాడు బాబ్జీ.

''అడవిలో పుట్టాల్సిన నీవు మా మధ్య పుట్టావేంటిరా? అందమైన అమ్మాయి తనంతట తాను వచ్చి లిఫ్ట్‌ అడిగితే ఇవ్వని పిచ్చి వెధవ ఎవడన్నా ఉంటాడా? నీకందులో థ్రిల్‌ తెలియదు. నేనయితే ఈ పాటికి ఝాం అంటూ నాలుగు రవుండ్స్‌ కొట్టి కాలేజీలో దింపేవాడ్ని. యునో... వెనుక గర్ల్‌ ఫ్రెండ్‌ కూర్చుంటే షడన్‌ బ్రేకులు వేస్తుండాలి అవసరం లేకపోయినా. ఎందుకో తెలుసా?'' అడిగాడు బాబ్జీ.

తెలియదన్నట్లుగా అమాయకంగా చూస్తున్న రాంబాబుని అక్కడికక్కడే పొడిచి చంపేయాలన్నంత కోపం వచ్చింది బాబ్జీకి.

''ఎందుకంటే... ఒద్దులే సెన్సార్‌...'' అంటూ బైక్‌ ఎక్కాడు.

Preview download free pdf of this Telugu book is available at Dear