• Davinci Kala Jeevitham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డావిన్సీ కళ జీవితం

    Davinci Kala Jeevitham

    Author:

    Publisher: Kaki Prachuranalu

    Pages: 284
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది లియోనార్డొ ద వించీ అనే పదిహేనో శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడి జీవితగాథ. రచయిత మోహన్ కవి, చిత్రకారుడు, చింతనాపరుడు. కవికి ఉండే ఊహాశాలిత, చిత్రకారుడికి ఉండే సమతౌల్య వర్ణదృష్టి, చింతనాపరుడికి ఉండే హేతుబద్ధత ఈ పుస్తకానికి మూలధాతువులు. ఈ మూడు లక్షణాలు ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. వస్తువూ, పరిశీలకుడూ, సౌందర్య సమన్వితాలైనప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూపడానికి ఈ పుస్తకం ఒక ఉదాహరణ. లియోనార్డొ చిత్రాలన్నీ కళాఖండాలే. ఆ ఒక్కొక్క చిత్రం గురించీ మోహన్ రాసిన కవితాత్మక, ఆలోచనాస్ఫోరక వాక్యాలు అప్పటికప్పుడు ఆ చిత్రాలని చూడాలనీ, మోహన్ వివరణని ఆస్వాదిస్తూ కొత్త అర్థాలను అన్వేషిస్తూ ఉండాలనీ అనిపించేలా చేస్తాయి.

లియోనార్డొ జీవితంలో అణువణువునా కనిపించేది ప్రగాఢమైన అన్వేషణ.. మతభావనల చిత్రీకరణలోనూ, మనుషుల చిత్రీకరణలోనూ ఆయన ఆ అన్వేషణా ఫలితాన్ని రంగరించాడు. లియోనార్డొ మహాద్భుత వర్ణమయ జీవితాన్ని మోహన్ అంతే వర్ణమయంగా అక్షరాలకెక్కించాడు. ఆ చిత్రకారుడు మరణించి ఐదువందల సంవత్సరాలవుతోంది. ఆయన కళలోని సౌందర్యం చిరంజీవిగా వర్ధిల్లుతోంది. ఆ నిరంతర నవనవోన్మేష సౌందర్యానికి ఎలుగెత్తిన మోహనగానం ఈ పుస్తకం.

- ఎన్. వేణుగోపాల్

గమనిక: "డావిన్సీ కళ జీవితం" ఈ-బుక్ సైజు 13MB

Preview download free pdf of this Telugu book is available at Davinci Kala Jeevitham