• Dasya Vimukti Kosam Matamarpidi
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దాస్య విముక్తి కోసం మతమార్పిడి

    Dasya Vimukti Kosam Matamarpidi

    Pages: 60
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మాత్రం చచ్చిపోను'' డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 1935లో చేసిన ప్రకటన యిది. అన్నట్టుగానే ఆయన 1956లో హిందూమతాన్ని విసర్జించి ఐదు లక్షల మంది అనుచరులతో కలసి మరీ బౌద్ధమతంలో చేరారు. ఆ మధ్య కాలంలో ఆయన దళితుల దాస్య విముక్తి గురించీ, మతమార్పిడి ఆవశ్యకత గురించీ వివిధ సభల్లో చేసిన ఉపన్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

చతుర్‌ వర్ణ వ్యవస్థ పునాదులు ఏమాత్రం చెక్కు చెదరకుండా అంటరానివాళ్లకు ''హరిజనులు'' అనే ఓ కొత్త పేరును అంటగట్టి దళిత సమస్యకు పైపై పరిష్కారం చూపబోయారు గాంధీజీ. అయితే ఆ పేరు మార్పు వల్ల దళితులకు ఒరిగేదేమీ లేదు, తమను అంటరానివాళ్లుగా, అధములుగా పరిగణించే హిందూమతాన్ని వదిలించుకుని బయటకు వచ్చినప్పుడే దళితులకు నిజమైన విముక్తి లభిస్తుంది అంటారు అంబేడ్కర్‌.

స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలకు హిందూ మతంలో స్థానం లేదు. 'మిమ్మల్ని సాటి మనుషులుగా చూడని మతంలో, మీకు చదువుకునే స్వేచ్ఛ లేకుండా... చివరికి గుక్కెడు మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేసిన మతంలో, మిమ్మల్ని జంతులవుకంటే హీనంగా చూసే ఈ హిందూ మతంలో ఇంకా మీరెందుకు పడివుండాలి?' అని ప్రశ్నిస్తారు అంబేడ్కర్‌. ఇవాళ ప్రపంచ శాంతికి దోహదం చేయగల మతం ఏదైనా వుందీ అంటే అది బౌద్ధ మతం మాత్రమే అంటారాయన.