• Danakarnudu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • దానకర్ణుడు

    Danakarnudu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథలంటే చెవులు కోసుకోని పిల్లలు ఉండరు. రాత్రి గబగబా బువ్వ తిని అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య చుట్టూనో, మంచం మీదకో చేరి కథ వింటూ ఊకొడుతూ నిద్రలోకి జారుకున్న తీపిగుర్తులు ఎందరికో. ఇట్లా కథలు చెప్పేవాళ్ళు ప్రతి ఇంటికీ, లేదా ప్రతి వాడకీ, ఊరికీ, కచ్చితంగా ఉండేవాళ్ళు. వీళ్ళు పౌరాణిక, జానపద, సాహస, హాస్య కథలు ఆసువుగా, ఆసక్తిదాయకంగా చెప్పేవాళ్ళు. మారుతున్న పరిస్థితులలో మౌఖిక సంప్రదాయం పోయి లిఖిత సంప్రదాయం ఏర్పడుతున్న క్రమంలో కథలు చెప్పే స్థాన్నాన్ని కథలు చదవడం ఆక్రమిస్తోంది. మౌఖిక కథలను లిఖిత రూపంలోకి మార్చే కృషి ఈపాటికే మొదలయింది.

ఇటువంటి ఒక చిన్న ప్రయత్నంతో మంచి పుస్తకం మీ ముందుకు వస్తోంది. శ్రీమతి బి. అన్నపూర్ణ గారు వాళ్ళ అమ్మమ్మ చెప్పిన కథల్లోంచి ఎనిమిది పౌరాణిక కథలను రాశారు. అవి ఈనాటి పిల్లలని అలరిస్తాయిఅని ఆశిస్తున్నాం.