• Dakshinafrica Nanilu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • దక్షిణాఫ్రికా నానీలు (free)

    Dakshinafrica Nanilu - free

    Publisher: Advik Prachuranalu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“మనసొక
కల్లోల సింధువు
మరి కన్నీరు
ఉపశమన బిందువు”

***
“ఎన్నాళ్ళు బతికావన్నదే
నీ వయస్సు
ఎలా బతికావన్నదే
నీ యశస్సు”

***
“అర్థరాత్రి అంతరంగంలో
ప్రసవవేదన
పొద్దున్నే కవి
ఉదయించాడు”

***
“నీ నోటికి మెతుకే
జై కిసాన్!
నీ కంటికి కునుకే
జై జవాన్!”

***
“ప్రపంచం నాదంటే
వాడు నియంత
ప్రపంచం నావాడంటే
అతడు ప్రవక్త”

***

సీతారామరాజు నెమ్మదస్తుడు, భావుకుడు. పుట్టిన దేశానికి దూరంగా ఉన్నా మన సాహిత్యాన్ని మరువనివాడు. విదేశంలో ఉన్నా కవిత్వ సంవేదనను పోగొట్టుకోలేదు, పైగా అది ద్విగుణీకృతం అయింది. రాజు కవిత్వంలో భావ సాంద్రత పుష్కలంగా వుంది.

- డా. ఎన్.గోపి

సీతారామరాజు నానీల సంపుటి మృష్టాన్న భోజనాన్ని వడ్డించిన విస్తరి. వివిధ రుచులతో వండి వడ్డించిన పదార్థాలలో వివిధ వస్తువులతో కవిత్వీకరించి, మనకు పంచిన నానీలు ఎన్నో ఉన్నాయి. అనుభూతి లోతుల్లోనుంచి రూపుదాల్చుకున్న నానీలు ఇవి. నానీల లక్షణాలను లక్షణంగా అనుసరించి రాసిన కవితా సంపుటి. అంత్యప్రాసలతో పరవళ్ళుదొక్కిన నానీలు. వెరసి నీ, నా భావాలను తట్టిలేపి ఆలోచింపజేసి అనుభూతి చెందించే నానీలు ఇవి.

- డా. తలతోటి పృథ్విరాజ్

తెలంగాణలో పుట్టి దక్షిణాఫ్రికాలో ఉద్యోగరీత్యా నివాసముంటున్న రాపోలు సీతారామరాజుకు సాహిత్య అధ్యయనం నిత్యకృత్యం. ఈనాటి యువకుల్లో కనిపించని భాషా మమకారం, సాహిత్యాభిరుచి ఇతనిలో మెండుగా కనిపిస్తాయి. మంచి సాహిత్యం సృష్టించే వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ కవిత్వానికి తనకూ ఉన్న భేధాన్ని పరిపుష్టం చేసుకుంటున్న సీతారామరాజులో మంచి కవి ఉన్నాడని ఈ నానీలను చూస్తే అర్థమవుతుంది.

- వెన్నెల సత్యం