• Dagger Of Shadow
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • డాగర్ ఆఫ్ షాడో

    Dagger Of Shadow

    Author:

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'నీ ఆఖరి కోరిక ఏమిటి?'

సూర్యుడు బారెడుదూరం పైకి వచ్చిన తర్వాత ముఖేష్‌ని బంధించిన గది ముందుకు వస్తూ అడిగాడు సర్వసైన్యాధిపతి.

చంద్రిక ద్వారా తను పంపిన డిస్ట్రెస్ సిగ్నల్ షాడోకి అందిందో లేదో ముఖేష్‌కి తెలియదు. ఒకవేళ అందినా, అందుకు సరైనా సమయానికి రాగలడో లేదో అతనికి తెలియదు. అతను రాలేకపోతే తను ఏం చెయ్యాలో తనంతట తనుగా నిర్ణయించుకోలేక తనలో తను మధనపడిపోతున్నాడతను.

అవసరం అయితే అప్పటికప్పుడు ఆ చెరసాలలో నుంచి తప్పించుకోగలననే ధైర్యం అతనికి వుంది.

తప్పించుకోవటంతో పరిష్కరించబడదు తమ సమస్య. భూపతి, నిశంభులు నిర్దోషులని నిరూపించబడాలి... ఎలా?

షాడోవచ్చి తన డైలమాకు పరిష్కారం చెపుతాడని అతని ఆశ. వరుసచూస్తుంటే ఆ ఆశ నిరాశ అయ్యేటట్లు కనిపిస్తుంది.

'ఆఖరి కోరిక ఏమిటని అడిగితే అలా నోరు తెరుచుకు చూస్తావేమిటి? వళ్ళు ఎలా వుంది?' ఎంత సేపటికీ అతను సమాధానం చెప్పకపోవటంతో కోపంగా అన్నాడు సర్వసైన్యాధిపతి.

'వళ్ళు ఎలావుంటే నీకెందుకు? నువ్వు ఏం చెయ్యగలవు? ప్రాణాలు తీస్తావా?' ఉన్నట్లుండి ఎగుసుకు వచ్చిన కోపాన్ని అదుపులో పెట్టుకోవటం చేతకాక విసురుగా అన్నాడు ముఖేష్.

పళ్ళు పటపటమని కొరుకుతూ వరలోవున్న ఖడ్గాన్ని బయటికి తీయబోయాడు సర్వసైన్యాధిపతి. అంతలోనే తను మాట్లాడుతున్నది మరణశిక్షను విధించబడిన మనిషితో అని గుర్తుకు వచ్చి ఆగిపోయాడు.

అతని యాక్షన్ ముఖేష్‌లో వెంటనే కలిగించిందొక ఆలోచనని మరణశిక్ష విధించబడిన నేరస్థులు ఏదో ఒక పాయింట్‌ని అడ్డుపెట్టుకొని కొద్దికాలం ఆ శిక్షను పోస్ట్‌పోన్ చేసుకుంటూ వుంటారు తమ కాలంలో ... అందుకు కోర్టులు, లాయర్లు మొదలైన ఫెసిలిటీస్ తమకున్నాయి.

ఎందుకూ పనికిరాని ఈ అనామక రాచరికపు యుగంలో అవి లేవు. అయినా మరణించబోయే మనిషి ఆఖరి కోరిక తీర్చాలనే నిబంధన ఒకటి ఈ కాలంలో వున్నట్టు కనిపిస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకొని షాడో తిరిగి వచ్చేదాకా ఉరిశిక్షను పోస్ట్ పోన్ చేయించుకోగలిగితే?

ఆ ఆలోచన మనసులో అడుగుపెట్టిన మరుక్షణం అమలులో పెట్టేశాడు ముఖేష్.

'మరణించే ముందు ఈ చిత్రదుర్గంలో అపరిమిత బలవంతులని పేరుపొందిన తమతో ఒక్కసారి ముష్టి యుద్ధం చేయటమే నా ఆఖరికోరిక, చేతనయితే తీర్చండి. చేతకాకపోతే నోరు మూసుకొని అవతలికి పొండి. అనవసరమైన ప్రసంగం వద్దు.' నిర్మొహమాటంగా చెప్పి, తన నులకమంచం దగ్గిరికి వెళ్ళిపోయాడు.

అదిరిపడి అలాగే నిలుచుండిపోయాడు సర్వసైన్యాధిపతి.

Preview download free pdf of this Telugu book is available at Dagger Of Shadow