-
-
డి.టి.పి. గైడ్ బుక్
DTP Guide Book
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 100Language: Telugu
పబ్లిషింగ్ రంగంలో డి.టి.పి. ఆపరేటర్లదే మూలకృషి. ఆలోచన వ్రాతలోకి మారాలాంటే రచయిత మూలమైతే, రచయిత భావాలను ప్రజల్లోకి తీసుకురావడానికి, పుస్తకరూపంలోకి మారాలంటే మధ్య వారధి మాత్రం డి.టి.పి.ఆపరేటర్లదే. అతి తక్కువ మూలధనంతో ప్రారంభించగల వ్యాపారం ఇదే.
ఎన్నెన్నో రంగాల్లో డి.టి.పి. ఉపయోగాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని... అందరికి చదవడానికి వీలు కల్పించడానికి సాధ్యమైనంత సులభంగా ఉండాలనే ఉద్దేశంతో అందించిన పుస్తకం ఇది.
దీనిని మూడు భాగాలుగా విభజించాను.
1. ఫోటోషాప్ బేస్ నుంచి స్టూడియో లెవెల్ వర్క్ కోసం
2. పేజి మేకర్ జీరో నుంచి నూరు వరకు
3. తెలుగు టైపింగ్ స్కిల్స్
వీటితో సహా అనుబంధంగా తెలుగు ఫాంట్ మోడల్ చార్ట్, సోర్స్ స్టోర్లో వివిధ ఫోట్లోలు, డింగ్బిట్ కోడింగ్, కీ కమాండ్స్, పేపర్ మోడల్ కటింగ్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది.
చివరగా మన సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు టెస్ట్ ప్రాక్టికల్స్ అందించాను. నా ఈ చిరు ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ..
- నల్లా సాయిరెడ్డి
