• Cine Kavitrayam
  • Ebook Hide Help
    ₹ 861
    861
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సినీ కవిత్రయం

    Cine Kavitrayam

    Pages: 2021
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది సముద్రాల రాఘవాచార్యుల గారి సినీ గీత వైభవాన్ని తెలిపే “జీవితమే సఫలము”, మల్లాది రామకృష్ణశాస్త్రి గారి సాహితీ ఘనతను తెలిపే “మది శారదాదేవి మందిరమే”, పింగళి నాగేంద్రరావు గారి అసమాన ప్రతిభను పాఠకుల ముందుంచిన “లాహిరి లాహిరి లాహిరిలో” అనే మూడు పుస్తకాలు కలిపిన సంపుటి.

రూ.1230.00 విలువ గల ఈ పుస్తకాలు 30% డిస్కౌంట్‌తో కేవలం రూ.861.00 కే మీకు అందిస్తున్నాము.

***

జీవితమే సఫలము

తెలుగు సినీ సాహిత్యాన్ని పాండిత్యంతో, కవిత్వంతో, తెలుగుదనంతో అలరించి ప్రామాణిక రచనలు చేసి అనంతర కవులకు మార్గదర్శనం చేసిన మహనీయుడు సముద్రాల వేంకట రాఘవాచార్యులు గారు.

కేవలం సముద్రాలగారు రాసిన పాటలను సేకరించి సంపుటాలు వేస్తే ప్రయోజనం వుండదని, ఆ మహారచయిత సాహితీతత్త్వాన్ని, తీరుతెన్నులను ఆమూలాగ్రం విశ్లేషించి వ్యాఖ్యానిస్తే తెలుగుచలన చిత్రరంగంలో వారి స్థానాన్ని అంచనా వేయటానికి అవకాశం వుంటుందని భావించి యీ సాహితీ యజ్ఞానికి పూనుకొన్నాము.

తెలుగు సినీ సాహిత్యానికి సంబంధించి సముద్రాల సీనియర్, నిజానికి రచనలోను, సృజనలోనూ సీనియరే! వేటూరి సుందరరామమూర్తి వారిని ‘గీతం భజే రాఘవం’ అని వినయంగా ప్రస్తుతించారు. మరికొందరు ’సినీకవికులపతి’ అని సంభాషించారు. అలాంటి మహనీయుని జీవితం, సాహిత్యం గురించి ఈ గ్రంథంలో వివరించబడింది.

ఈ సంపుటంలో 1937 నుండి 1969 వరకు గల మధ్యకాలంలో సముద్రాల రచన చేసిన చలనచిత్రాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది.

***

మది శారదాదేవి మందిరమే

మల్లాదివారి పాటలను మాటకు మాట, పాటకు పాట విడదీసి అందులో త్రివేణి సంగమం చూపించిన చిన్న పుస్తకం ఇది.

- వి.ఎ.కె. రంగారావు

"సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది".

- తాపీ ధర్మారావు

"శ్రీ మల్లాదివారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు. అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు".

- పింగళి నాగేంద్రరావు

" తెలుగు సినిమా పాటకి సాహిత్య ప్రశస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు శ్రీ మల్లాది ".

- శ్రీ శ్రీ

" అతని శైలిలోన అమృతాలు తొణుకాడు, నతని పలుకులందు నలరు లలరు ".

- దాశరథి

" శ్రీ మల్లాదివారి ప్రతి పదబంధం మధు నిష్యందం ".

- సి. నారాయణరెడ్డి

" ఆయన పలుకుల్లోంచి అమృతం పుట్టింది, అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది ".

- వేటూరి సుందరరామమూర్తి

***

లాహిరి లాహిరి లాహిరిలో

సినిమాపాటకు కావ్య గౌరవం కలిగించిన మహనీయుల్లో కీ||శే|| పింగళి నాగేంద్రరావు గారొకరు. సినిమా పాట ఎలా రాయాలో, ఎలా రాయకూడదో తెలిసిన రసశిల్పి.

పింగళి నాగేంద్రరావుగారి సినీ సాహిత్యంపై వెలువడిన మొదటి భాగంలో పింగళి వారి జీవనరేఖలు మొదలుకొని ఆయన సాహితీ మార్గంతో సహా తొలి పాట నుండి 1960లో ‘మహాకవి కాళిదాసు’ (1960) వరకు సవివరంగా విశ్లేషిస్తూ వాఖ్యానంతో ప్రచురించడం జరిగింది. ప్రచురణానంతరం కొద్ది మాసాల్లోనే సహృదయులైన పాఠకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఆదరించిన పాఠకులకు, ఆయా పత్రికల్లో ఉత్తమ విలువలతో సమీక్షించిన విమర్శకులకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

ఆ స్ఫూర్తితోనే పింగళివారి రెండవ భాగాన్ని డా|| వి.వి.రామారావు గారి చేతనే రచన చేయించి మీ ముందుకు తీసుకువస్తున్నాము. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధన స్థాయికి సమానంగా పరిశ్రమించి ఎంతో ఓర్పుతో అనేకానేక విషయాలను క్రోడీకరించి సరళమైన భాషలో డా||రామారావు ఈ రచనా యజ్ఞాన్ని నిర్వహించినందుకు వారికి ఎప్పటికీ మేము కృతజ్ఞులం.

- పబ్లిషర్స్

గమనిక: " సినీ కవిత్రయం " ఈబుక్ సైజు 43.5mb

Preview download free pdf of this Telugu book is available at Cine Kavitrayam