• Chivari Gudise
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చివరి గుడిసె

    Chivari Gudise

    Pages: 140
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'చివరి గుడిసె' బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ. నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమయిన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి. శిల్పంలో, చిత్రణలో, ప్రయోజనంలో ఒక 'కన్యాశుల్కం' ఒక 'యజ్ఞం' మాత్రమే దీనికి సాటిరాగల రచనలు.

అయితే గురజాడ. ఉన్నవ, కాళీపట్నం వంటి మహారచయితలు ఒకే కాలానికీ, ఒకే వ్యవస్థకూ చెందిన వైరుధ్యాల్ని చిత్రించగా డా. కేశవరెడ్డి భిన్న వ్యవస్థలకు చెందిన వైరుధ్యాల్నీ, భూమిపైనా, పాతాళంలోనూ కూడ జరిగే పోరాటాన్నీ అత్యంత ప్రతిభావంతమైన శిల్ప నైపుణ్యంతో చిత్రించాడు ఈ నవలలో.

యానాది కుర్రవాడు- నవల మొదలు కావడమే దుమ్ము రేపుకంటూ మొదలయింది. ఇక ముగింపు అంటే, ఏ సంఘటన వైపుగా కథా క్రమంలోని అన్ని సంఘటనలూ ప్రవహిస్తాయో. ఆ చివరి సంఘటన తొలి మానవుడి చివరి గుడిసె కూడ నిర్జనమై చివరకి దుమ్ములో కలసిపోవడమే ఈ కథకి ముగింపు. ఈ స్పష్ట మయిన ఆది మధ్యాంతాలతో పాటు ఇతివృత్తంలో ఏకత, స్థలంలో ఏకత, కాలగమనంలో ఏకత- గొప్ప నాటకాలకు ఏ త్రివిధ ఏకత్వాలను ఉత్తమ లక్షణాలుగా పేర్కొంటారో అవి ఈ కథలో అద్భుతంగా అమరాయి.

అన్నిటకన్నా విశిష్టమయింది - ఈ కథని చెప్పే తీరు. పురాతన ఆసియా సంప్రదాయపు కథన రీతి ఇది. జరగబొయ్యే సంఘటనలని ముందే సూచిస్తూ ఉత్కంఠ రేకెత్తించే ఈ పద్ధతి గ్రామీణులు కథలు చెప్పే పద్ధతి లాంటిది.

- వాడ్రేవు చినవీరభద్రుడు

Preview download free pdf of this Telugu book is available at Chivari Gudise