• Chittoor Zilla Vandella Katha Saradhulu 1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • చిత్తూరు జిల్లా - వందేళ్ళ కథా సారధులు 1

    Chittoor Zilla Vandella Katha Saradhulu 1

    Publisher: Kala Prachuranalu

    Pages: 170
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నవలకయితే సుధీర్ఘమైన చరిత్రేవుంది ప్రపంచంలో. జపాన్ రచయిత్రి అయిన ‘మురసాకిషకుచు’ పదకొండవ శతాబ్ధంలోనే ‘గెంజిమోనో గోతారి’ అన్న నవలను వెలువరించారు. పాశ్చాత్య విమర్శకుల భావనలో అదే ప్రపంచపు తొట్టతొలి నవల. ఈ నవల ‘గెంజిగాధ’గా తెలుగులోకి అనువదింపబడినది. భారతదేశంలో తొలి నవలను 1865లో బంకించంద్రచటర్జీ వెలువరించగా, తెలుగులో తొట్టతొలి నవల ‘సుదక్షిణా చరిత్రము’ జయంతి సూరమ్మగారు 1906లో వెలువరించినట్లు తెలుస్తున్నది.

‘కథ’ వేదకాలం నుండీ ప్రాచుర్యంలో వున్నదయినా ఆధునిక కథ ఆవిర్భావం మాత్రం భాకంతదేశంలో కాస్త ఆలస్యంగానే జరిగింది.అంతకు ఏభయి సంవత్సరాలకు ముందే అమెరికా, రష్యాలలో కథ ప్రాచుర్యంలో వున్నట్లు తెలుస్తున్నది. 1805లో పశ్చిమబెంగాల్‌లో ‘చండీచరణ్’ అన్న రచయిత వెలువరించిన ‘తాతా ఇతిహాస్’ అన్న కథ భారతదేశపు మొట్టమొదటి కథగా భావింపబడ్తున్నది.

ఆంధ్రదేశంలో 1855లో సి.పి.బ్రౌన్‌గారు ప్రచురించిన తాతాచారి కథల ద్వారా (నేలటూరు వెంకటాచలం పంతులు) గారు, ‘హిందూ సుందరి అన్న పత్రిక ద్వారా ప్రచురితమైన ‘ధనత్రయోదశి’ కథ ద్వారా బండారు అచ్చమాంబ గారు, 1910 నాటి ‘దిద్దుబాటు’ కథానిక ద్వారా గురజాడ అప్పారావుగారు తొలితెలుగు ఆధునిక కథకులుగా భావింపబడ్తున్నారు.

ఇప్పటికి లభ్యమవుతున్న ఆధారాలను బట్టి చిత్తూరు జిల్లా తొలి కథకులు ఎం.వి.పాపన్న గుప్త గారు. 1927 ప్రాంతంలోనే వీరి కథలు ప్రచురితమయ్యాయి! ఇహ అక్కడ్నుండీ ఎందరో చిత్తూరు జిల్లా కథకులు తమతమ సాహితీ సృజనలతో తెలుగు సాహిత్య కథావనాన్ని సుసంపన్నం చేస్తూ వచ్చారు. వారిలో కొందరిని గూర్చయినా తెలుసుకోవడానికి నేను చేసిన చిరు ప్రయత్నంలో ఒక చిన్న భాగం... ఈ గ్రంధం.....

- టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Chittoor Zilla Vandella Katha Saradhulu 1